కార్మిక హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలు

ABN , First Publish Date - 2023-09-18T00:29:55+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు తీసుకొస్తున్న కార్మిక ప్రజావ్యతిరేక విధా నాలను వ్యతిరేకించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్య క్షుడు తమ్మినేని సూర్యనా రాయణ డిమాండ్‌ చేశా రు.

కార్మిక హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలు

బాడంగి, సెప్టెంబ రు 17: కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు తీసుకొస్తున్న కార్మిక ప్రజావ్యతిరేక విధా నాలను వ్యతిరేకించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్య క్షుడు తమ్మినేని సూర్యనా రాయణ డిమాండ్‌ చేశా రు. మండలంలో సీఐటీయూ విస్తృత స్థాయి సమావేశాన్ని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఆదివారం నిర్వహించారు. సీఐటీయూ మండల నాయకులు రవణమ్మ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తమ్మినేని సూర్యనా రాయణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికులపై తీవ్ర భారాలను మోపుతుంద న్నారు. కార్మిక హక్కులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హరిస్తున్నాయన్నారు. ఈ ప్రభుత్వానికి కార్మికులు కూడా ఓట్లేసి గెలిపించారని గుర్తు చేశారు. భవిష్యత్తులో అదే కార్మికులు ప్రభుత్వాలను ఇంటికి పంపించే పరిస్థితి వస్తుందన్నారు. ఈ కార్యక్ర మంలో సీఐటీయూ జిల్లా నాయకులు ఎ.సురేష్‌, ఎస్‌.గోపాల్‌, అంగన్‌వాడీ, ఆశా, పంచాయతీ కార్మికులు, గ్రీన్‌ అంబాసిడర్లు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-18T00:29:55+05:30 IST