వైభవంగా పూలంగి సేవ
ABN , Publish Date - Dec 31 , 2023 | 12:11 AM
పట్టణంలోని కంచరవీధి కళ్యాణవేంకటేశ్వరస్వామి ఆలయంలో ధనుర్మాస మహోత్సవాల్లో భాగంగా శనివారం పూలంగి సేవను వైభవంగా నిర్వహించారు. మూలవిరాట్‌తో పాటు, ఇతర ఉత్సవ విగ్రహాలను, ఆలయ ప్రాంగణమంతా పూలతో అలంకరించారు.
వైభవంగా పూలంగి సేవ
ప్రత్యేక ఆకర్షణగా పుట్టలో వెంకన్న
బొబ్బిలి, డిసెంబరు 30: పట్టణంలోని కంచరవీధి కళ్యాణవేంకటేశ్వరస్వామి ఆలయంలో ధనుర్మాస మహోత్సవాల్లో భాగంగా శనివారం పూలంగి సేవను వైభవంగా నిర్వహించారు. మూలవిరాట్‌తో పాటు, ఇతర ఉత్సవ విగ్రహాలను, ఆలయ ప్రాంగణమంతా పూలతో అలంకరించారు. అర్చకుడు శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాశురాలను, విష్ణుసహస్ర నామ స్తోత్ర పారాయణం, సుప్రభాతం, గోవింద నామార్చన వంటివి చేపట్టారు. ఆలయాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రాంగణంలో కృత్రిమ పుట్టను ఏర్పాటు చేసి అందులో వెంకన్న స్వామిని అమర్చారు. ఈ దృశ్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.