హడలెత్తించాయ్!
ABN , First Publish Date - 2023-09-18T00:19:20+05:30 IST
ఏనుగుల గుంపు రహదారిపైకి రావడంతో వాహన చోదకులు, పాదచారులు భయాందోళన చెందారు. ఆదివారం సాయంత్రం అర్తాం గదబవలస సమీపంలోని రహదారిపై ఏడు ఏనుగులు హల్‌చల్ చేశాయి.

కొమరాడ, సెప్టెంబరు 17 : ఏనుగుల గుంపు రహదారిపైకి రావడంతో వాహన చోదకులు, పాదచారులు భయాందోళన చెందారు. ఆదివారం సాయంత్రం అర్తాం గదబవలస సమీపంలోని రహదారిపై ఏడు ఏనుగులు హల్‌చల్ చేశాయి. దీంతో గుణానుపురం గ్రామానికి వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వెంటనే అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో వారు హుటాహుటిన అక్కడకు చేరుకుని రహదారిపైన ఉన్న ఏనుగులను పంట పొలాల్లోకి తరలించారు. ఆ తర్వాత వాహనదారులు యథావిధంగా రాకపోకలను సాగించారు. ఇదిలా ఉండగా ఒంటరి ఏనుగు హరి అర్తాం కొండపై ఉంది. గత కొద్ది రోజులుగా ఏనుగుల గుంపు నుంచి విడిపోయి ఒంటరిగా తిరుగుతుంది. దీంతో సమీప ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏ క్షణాన గ్రామాల్లోకి వచ్చి పశువులపై దాడి చేస్తుందోనని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఒంటరి ఏనుగును బంధించి జంతు ప్రదర్శన శాలకు తరలించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కాగా గ్రామాల్లో వినాయక చవితి ఉత్సవాలకు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. ఈ సమయంలో బాణసంచా కాల్చే అవకాశం కూడా ఉంది. ఆ శబ్దాలకు ఏనుగుల గుంపు బెదిరి ప్రజలపై దాడి చేసే అవకాశం కూడా ఉన్న నేపథ్యంలో అటవీశాఖ అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ఆయా ప్రాంతవాసులు కోరుతున్నారు.
అప్రమత్తంగా ఉండాలి: డీఎఫ్‌వో
పార్వతీపురం, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): గజరాజులు సంచరిస్తున్న ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎఫ్‌వో ప్రసూన ఆదివారం ఓ ప్రక టనలో సూచించారు. కొమరాడ మండలం అర్తాం కొండపై ఒంటరి ఏనుగు ఉంద ని, మిగిలిన 7 ఏనుగులు పార్వతీపురం రేంజ్ ముంపు ప్రాంతంలో , మరో 4 గజ రాజులు కురుపాం రేంజ్ జరగడ గ్రామం వద్ద ఉన్నాయన్నారు. వినాయక చవితి సందర్భంగా మండపాల వద్ద 70 డెసీబుల్స్ కంటే తక్కువగా సౌండ్ ఉండేలా చూడాలన్నారు. సాయంత్రం 6 గంటల తర్వాత స్పీకర్లు వాడరాదని తెలిపారు. నిమ జ్జనం తేదీ, సమయం, ప్రదేశాన్ని బీట్ ఆఫీసర్‌కు తెలియజేయాలన్నారు.