జీసీసీని లాభాల బాట పట్టిస్తా: ఎండీ సురేష్‌

ABN , First Publish Date - 2023-01-25T00:10:49+05:30 IST

జీసీసీని లాభాల బాట పట్టించేందుకు అన్నిరకాల చర్యలూ తీసుకుంటున్నామని ఆ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ జి.సురేష్‌ కుమార్‌ స్పష్టం చేశారు.

జీసీసీని లాభాల బాట పట్టిస్తా: ఎండీ సురేష్‌

రాజాం రూరల్‌: జీసీసీని లాభాల బాట పట్టించేందుకు అన్నిరకాల చర్యలూ తీసుకుంటున్నామని ఆ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ జి.సురేష్‌ కుమార్‌ స్పష్టం చేశారు. గతంలో నెలకు రూ.50 లక్షల మేర ఉన్న జీసీసీ ఉత్పత్తుల అమ్మకాలు ప్రస్తుతం రూ.1.75 కోట్లకు చేరుకున్నాయని, వార్షిక టర్నోవర్‌ రూ.500 కోట్లకు చేరిందని ఆయ న వివరించారు. విజయనగరం జిల్లా రాజాంలో పాలవలస శ్రీనివాసరావు గృహం లో తనకు కలిసిన విలేకరులతో మంగళవారం ఆయన మాట్లాడారు. గిరిజన ఉత్ప త్తులైన తేనె, ఇన్‌స్టెంట్‌ కాఫీకి అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్‌ పెరుగు తోందన్నారు. కాఫీ గింజలు కిలో రూ.270 ధర పలుకుతుందన్నారు. ప్రస్తుతం 350 టన్నుల ఉత్పత్తి జరుగుతోందని, 800 టన్నులకు పెరిగేలా క్షేత్రస్థాయిలో చర్యలు ప్రారంభించామని వివరించారు. గిరిజనలు జీసీసీకే తాము పండించిన పంటను అ మ్ముతున్నారని, ఫలితంగా ఆర్దికంగా లాభపడుతున్నారని వివరించారు. గిరిజనులు దళారుల బారిన పడకుండా ఉండేందుకు వారు పండించే చిరుధాన్యాలు (మిల్లెట్స్‌) కు మద్దతు దర కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మిల్లెట్స్‌ వినియో గం పెరిగిన నేపధ్యంలో వాటి ఉత్పత్తులపై గిరిజనలు ప్రత్యేక దృష్టి పెట్టారని వివ రించారు. వీటికి దేశవ్యాప్తంగా డిమాండ్‌ ఉందన్నారు. గిరిజన ఉత్పత్తులు అమ్మేందుకు ఆసక్తికల యువతకు ఫ్రాంచైసీలు ఇస్తున్నామని స్పష్టం చేశారు.

Updated Date - 2023-01-25T00:10:50+05:30 IST