Share News

పంటలను నాశనం చేస్తున్న గజరాజులు

ABN , First Publish Date - 2023-12-11T00:19:41+05:30 IST

రైతులు పండించిన పంటలను ఏనుగులు నాశనం చేస్తున్నాయి. మండలంలో గుణానుపురం గ్రామ సమీపంలో ఏనుగులు సంచరిస్తు న్నాయి. పంట పొలాల్లోకి వెళ్లి వరి పనలను చిందరవం దర చేస్తున్నాయి. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు.

 పంటలను నాశనం చేస్తున్న గజరాజులు
కోసిన వరి పంటను నాశనం చేస్తున్న ఏనుగులు

కొమరాడ, డిసెంబరు 10: రైతులు పండించిన పంటలను ఏనుగులు నాశనం చేస్తున్నాయి. మండలంలో గుణానుపురం గ్రామ సమీపంలో ఏనుగులు సంచరిస్తు న్నాయి. పంట పొలాల్లోకి వెళ్లి వరి పనలను చిందరవం దర చేస్తున్నాయి. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. గత కొద్ది రోజులుగా కళ్లికోట, దుగ్గి, మార్కొండపుట్టి గ్రామాల్లో సంచించిన ఏనుగులు ఆదివారం గుణానుపురం చేరుకున్నాయి. రైతులు వరి కోతలను ముమ్మరంగా చేపడుతున్నారు. ఈ సమయంలో ఏనుగుల గుంపు పంట పొలాల్లో సంచరించడంతో వారు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఒకవైపు తుఫాన్‌ కారణంగా పంటకు నష్టం వాటిల్లిందని, మిగిలిన పంటను గజరాజులు నాశనం చేస్తున్నాయని రైతులు వాపోతున్నారు. తక్షణమే ఈ ప్రాంతం నుంచి ఏనుగులను తరలించాలని కోరుతున్నారు.

Updated Date - 2023-12-11T00:19:43+05:30 IST