Share News

లారీ ఢీకొని నాలుగు ఆవులు మృతి

ABN , Publish Date - Dec 14 , 2023 | 12:18 AM

లారీ ఢీకొనడంతో నాలుగు ఆవులు మృతి చెందిన ఘటన మండలంలో చోటు చేసుకుంటుంది. మరో రెండు పశువులకు గాయాలవ్వగా, పశువులను తోలుకు వెళ్తున్న హంసకడుము గ్రామానికి చెందిన కె.వరద య్యకు కూడా స్వల్ప గాయాలైనట్లు ఎస్‌ఐ జగదీష్‌ నాయుడు తెలిపారు.

లారీ ఢీకొని నాలుగు ఆవులు మృతి

సీతంపేట: లారీ ఢీకొనడంతో నాలుగు ఆవులు మృతి చెందిన ఘటన మండలంలో చోటు చేసుకుంటుంది. మరో రెండు పశువులకు గాయాలవ్వగా, పశువులను తోలుకు వెళ్తున్న హంసకడుము గ్రామానికి చెందిన కె.వరద య్యకు కూడా స్వల్ప గాయాలైనట్లు ఎస్‌ఐ జగదీష్‌ నాయుడు తెలిపారు. దీనికి సంబంధించి ఎస్‌ఐ అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. మలద సంత నుంచి రాజాం సంతకు మంగళవారం రాత్రి పశువులను తోలుకుని వెళ్తుండగా కే.గు మ్మడ సమీపంలో సీతంపేట నుంచి కొత్తూరు వైపు వెళ్తున్న లారీ ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీనిపై కేసు నమోదు చేశామన్నారు.

Updated Date - Dec 14 , 2023 | 12:18 AM