గుండెపోటుతో అటవీశాఖ ఉద్యోగి మృతి
ABN , First Publish Date - 2023-09-26T00:11:46+05:30 IST
అటవీశాఖ ఉద్యోగి గుండెపోటుతో మృతిచెందిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. కురుపాంలో అటవీ శాఖలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కోపన్నగారి శివ శంకర్(59) డెప్యూటేషన్‌పై సాలూరులో ఈనెల 8 వరకు పనిచేశారు. డెప్యూటేషన్ పూర్తి కావడంతో ఈనెల 9న మళ్లీ కురుపాంలో విధుల్లో చేరారు.

సాలూరు రూరల్/ పార్వతీపురంటౌన్: అటవీశాఖ ఉద్యోగి గుండెపోటుతో మృతిచెందిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. కురుపాంలో అటవీ శాఖలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కోపన్నగారి శివ శంకర్(59) డెప్యూటేషన్‌పై సాలూరులో ఈనెల 8 వరకు పనిచేశారు. డెప్యూటేషన్ పూర్తి కావడంతో ఈనెల 9న మళ్లీ కురుపాంలో విధుల్లో చేరారు. అయితే సాలూరు కార్యాల యానికి చెందిన కొన్ని లేఖలు పార్వతీపురం కార్యాలయం లో ఇచ్చి, కురుపాం వెళ్లడానికిగాను సోమవారం సాలూరులో ఆర్టీసీ బస్సు ఎక్కారు. పార్వతీపురం సమీపంలో గుండెపోటు రావడంతో సీటులోనే కుప్పకూలిపోయారు. బ స్సు సిబ్బంది 108 వాహనానికి ఫోన్ చేయగా వారొచ్చి మృతిచెందినట్టు నిర్ధారించారు. పార్వతీపురం పట్టణ పోలీసులు మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. శివ శంకర్ పార్వతీపురం మండలం నర్సిపురం గ్రామ సమీపంలో ఉన్న కాలనీలో నివా సం ఉంటున్నారు. ఆయనకు ఇద్దరు భార్యలు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె సత్య విశాఖలో ఉండగా, చిన్న కుమార్తె దివ్య అమెరికాలో ఉన్నారు.