ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాలకు ఎదురుచూపులు

ABN , First Publish Date - 2023-06-03T00:36:42+05:30 IST

రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ అండ్‌ టెక్నాలజీ (ఆర్జీయూకేటీ) పరిధిలోని ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ కోసం విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలై 25 రోజులు కావస్తున్నా నోటిఫికేషన్‌ విడుదల కాలేదు.

ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాలకు   ఎదురుచూపులు

టెన్త్‌లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థుల నిరీక్షణ

ఇప్పటికే ప్రారంభమైన పాలిటెక్నిక్‌ కౌన్సెలింగ్‌.. ఇంటర్‌ ఆడ్మిషన్లు

కలెక్టరేట్‌, జూన్‌ 2: రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ అండ్‌ టెక్నాలజీ (ఆర్జీయూకేటీ) పరిధిలోని ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ కోసం విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలై 25 రోజులు కావస్తున్నా నోటిఫికేషన్‌ విడుదల కాలేదు. ఇప్పటికే పాలిటెక్నిక్‌ కౌన్సెలింగ్‌, ఇంటర్‌ ఆడ్మిషన్ల ప్రక్రియ మొదలైంది. దీంతో టెన్త్‌లో మంచి మార్కులు సాఽధించిన విద్యార్థులు ఎటువైపు వెళ్లాలో తెలియక అయోమయంలో ఉన్నారు.

గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ప్రపంచ స్థాయి సాంకేతిక విద్యను అందించాలన్న ఉద్దేశంతో 2008లో ట్రీపుల్‌ ఐటీని ప్రవేశ పెట్టారు. తొలినాళ్ల నుంచి పదో తరగతి మార్కులు ఆధారంగానే ప్రవేశాలు కల్పిస్తున్నారు. తర్వాత రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో చదివిన విద్యార్థులకు 0.4 శాతం పాయింట్లను అదనంగా చేర్చి ప్రవేశాలు కల్పిస్తున్నారు. గత మూడేళ్లలో తొలి రెండేళ్లు కొవిడ్‌ ప్రభావంతో పదో తరగతి పరీక్షలు లేకపోయాయి. దీంతో ప్రవేశ పరీక్ష నిర్వహించి దాంట్లో వచ్చిన మార్కుల ఆధారంగా ట్రిపుల్‌ ఐటీ అడ్మిషన్‌ ప్రక్రియ సాగింది. ఈ ఏడాది ఇప్పటి వరకూ దీనిపై ఎటువంటి సృష్టత రాకపోవడంతో సీటు కోసం ఆశ పెట్టుకున్న విద్యార్థులు నోటిఫికేషన్‌ కోసం ఎదురు చూస్తున్నారు.

Updated Date - 2023-06-03T00:36:42+05:30 IST