Share News

అభివృద్ధి ప్రణాళికలపై దృష్టి సారించాలి

ABN , Publish Date - Dec 30 , 2023 | 12:21 AM

పంచాయతీల పరిధిలో అభివృద్ధి ప్రణాళికలపై దృష్టి సారించా లని ఏపీ పంచాయతీరాజ్‌ కమిషనర్‌ ఎన్‌.సుధాకర్‌రావు ఆదేశించారు.

అభివృద్ధి ప్రణాళికలపై దృష్టి సారించాలి

గరుగుబిల్లి: పంచాయతీల పరిధిలో అభివృద్ధి ప్రణాళికలపై దృష్టి సారించా లని ఏపీ పంచాయతీరాజ్‌ కమిషనర్‌ ఎన్‌.సుధాకర్‌రావు ఆదేశించారు. శుక్రవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో కార్యదర్శులు, సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్థాయితో పాటు బ్లాక్‌ స్థాయి, జిల్లా స్థాయిలో విధిగా యాక్షన్‌ ప్లాన్‌లు తయారు చేయాలన్నారు. యాక్షన్‌ ప్లాన్‌లు తయారీపై అవసరమైన శిక్షణ నిర్వహించారు. ప్రణాళికల్లో రూపొందిం చిన అంశాలు మేరకు అభివృద్ధి పనులు నిర్వహించి చెల్లింపులు చేయాలన్నారు. నిబంధనలు పాటించకుంటే రికవరీలు తప్పవని ఆయన హెచ్చరించారు. అలాగే జనవరిలో గ్రామసభలు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో ఈవోపీఆర్‌డీ ఎల్‌.గోపాలరావు, ఏవో ఎన్‌.అర్జునరావు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.

Updated Date - Dec 30 , 2023 | 12:21 AM