మున్సిపాల్టీల అభివృద్ధిపై దృష్టి

ABN , First Publish Date - 2023-09-22T00:05:23+05:30 IST

మున్సిపాల్టీల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు రీజనల్‌ డైరెక్టర్‌ నాగరాజు చెప్పారు.

 మున్సిపాల్టీల అభివృద్ధిపై దృష్టి

పార్వతీపురం టౌన్‌: మున్సిపాల్టీల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు రీజనల్‌ డైరెక్టర్‌ నాగరాజు చెప్పారు. గురువారం పార్వతీపురం మన్యం జిల్లాలో భూ రీ సర్వే, పారిశుధ్య నిర్వహణ, సీజనల్‌ వ్యాధులతో పాటు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గార్బేజీ ఫ్రీ ఇండియా కార్యక్రమంపై కమిషనర్‌ జె.రామఅప్ప లనాయుడు, అధికారులతో మున్సిపల్‌ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూ రీ సర్వేకు సంబంధించి అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలన్నారు. పారిశుధ్యంతో పాటు సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. రెవెన్యూ అధికారులు ఆదాయాన్ని పెంచే విధంగా ఇంటి, కుళాయి పన్నుల వసూళ్లను ప్రణాళికాబద్ధంగా వసూలు చేయాలన్నారు.

సీడీఎంఏ కోటేశ్వరరావు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆర్‌డీ నాగరాజుతో పాటు, కమిషనర్‌ రామఅప్పలనాయుడు, సచివాలయ అధికా రులు పాల్గొన్నారు. రీ సర్వేకు సంబంధించి ఎవరైనా నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు చేపడతామన్నారు.

విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని ఆర్‌డీ నాగరాజు అధికారులను హెచ్చరించారు. స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో విలేక రులతో మాట్లాడుతూ భూ రీ సర్వే విషయంలో అధికారులు చిత్తశుద్ధితో విధులు నిర్వహించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

Updated Date - 2023-09-22T00:05:23+05:30 IST