ఆసుపత్రిలో పరిశుభ్రతపై దృష్టి సారించండి
ABN , First Publish Date - 2023-03-18T23:51:32+05:30 IST
ఆసుపత్రిలో గార్డెనింగ్, పరిశుభ్రతపై దృష్టి సారించాలని ఏపీ ఎయిడ్స్ కంట్రోల్ అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వై.కామేశ్వరప్రసాద్ తెలిపారు.

జియ్యమ్మవలస: ఆసుపత్రిలో గార్డెనింగ్, పరిశుభ్రతపై దృష్టి సారించాలని ఏపీ ఎయిడ్స్ కంట్రోల్ అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వై.కామేశ్వరప్రసాద్ తెలిపారు. చినమేరంగి సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా కాయకల్ప ప్రొగ్రాం కమిషనర్‌గా ఉన్న ఆయన ఆసుపత్రిలో అన్ని విభాగాలను తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలపై సూపరింటెండెంట్ ఎ.ప్రతిమను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఏపీ బయో మెడికల్ కన్సల్టెంట్ రమేష్ ఉన్నారు. కార్యక్రమంలో వైద్యాధికారులు ఎ.పునీత పద్మావతి, ఎన్.లోకాభినయ్, స్వామినాయుడు, టీకేఎస్ కుమార్, ఆర్.రమ్య, హెడ్ నర్సు కె.పార్వతి పాల్గొన్నారు.ఫ కురుపాం: కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఏపీ ఎయిడ్స్ కంట్రోల్ అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వై.కామేశ్వరప్రసాద్ శనివారం సందర్శించారు. ఈసందర్భంగా ఆసుపత్రిలో ఐసీటీసీ, వార్డులు, ఆక్సిజన్ ప్లాంట్, పరిసరాలు పరిశీలించారు. ఆసుపత్రి నిర్వహణపై సూపరింటెండెంట్ శోభరాణిని అడిగి తెలుసుకున్నారు. రికార్డులు తనిఖీచేశారు. ఆయన వెంట ఏపీ బయో మెడికల్ కన్సల్టెంట్ రమేష్ ఉన్నారు. కార్యక్రమంలో వైద్యాధికారి సందీప్, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.