మామిడి, జీడి తోటల దగ్ధం

ABN , First Publish Date - 2023-03-11T23:52:06+05:30 IST

ఇంగిలాపల్లి గ్రామ సమీపంలోగల జీడి, మామిడితోట లు శనివారం జరిగిన అగ్ని ప్రమాదంలో దగ్ధమయ్యాయి.

మామిడి, జీడి తోటల దగ్ధం

దత్తిరాజేరు: ఇంగిలాపల్లి గ్రామ సమీపంలోగల జీడి, మామిడితోట లు శనివారం జరిగిన అగ్ని ప్రమాదంలో దగ్ధమయ్యాయి. రైతుల సమాచారం మేరకు అగ్ని మాపక సిబ్బంది వచ్చి, మంటలను అదుపుచేశారు. గ్రామానికి చెందిన డొంక రామకృష్ణ, డొంక అప్పారావు, డొంక సింహాద్రి, డొంక రాజులకు చెందిన మామిడితో టలతోపాటు దేవుడుమాన్యం భూమిలోని సుమారు 25 ఎకరాలల్లో జీడి, మామిడి మొక్కలు కాలిపోయినట్టు అగ్నిమాపక అధికారి రవిప్రసాద్‌కు స్థానికులు తెలిపారు. ప్రస్తుతం తోటలు పూత, పిందె దశలో ఉన్నాయని, లక్షల్లో ఆస్తినష్టం ఉండవ చ్చని ఆవేదన వ్యక్తంచేశారు. అలాగే సుత్తి రామకృష్ణకు చెందిన గడసాం గ్రామ సమీపంలోగల సుమారు 80 మామిడి మొక్కలు అగ్నికి ఆహుతయ్యాయి. ఎవరో ఆకతాయిలు సిగిరెట్‌ కాల్చి పడేయటం వల్ల ఈ ప్రమాదం సంభవించి ఉండవచ్చ ని చెప్పారు. సంబంధిత అధికారులు న్యాయం చెయ్యాలని రైతులు కోరారు.

వెంకటబైరిపురంలో పది గడ్డి కుప్పలు..

మక్కువ: మండలంలోని వెంకటబైరిపురం గ్రామంలో విద్యుత్‌ షార్ట్‌స ర్క్యూ ట్‌తో పది గడ్డి కుప్పలు దగ్ధమైన ఘటన శనివారం చోటుచేసుకుంది. శీర కాశీనా యుడుకు చెందిన ఐదు, శీర పైడినాయుడుకు చెందిన రెండు, బిక్కిన వెంకన్నబా బుకు చెందిన ఒకటి, యండమూరి త్రినాథకు చెందిన రెండు గడ్డి కుప్పలు దగ్ధమ య్యాయి. సమాచారం అందుకున్న సాలూరు అగ్నిమాపక సిబ్బం ది వచ్చి, మంట లు అదుపు చేశారు.

Updated Date - 2023-03-11T23:52:06+05:30 IST