ప్రజాదరణ చూసి ఓర్వలేకే తప్పుడు కేసులు
ABN , First Publish Date - 2023-09-26T00:01:57+05:30 IST
చంద్రబాబునాయుడుకు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకే వైసీపీ ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయిస్తోందని తెలుగుదేశం పార్టీ నాయకులు ధ్వజమెత్తారు.

చంద్రబాబునాయుడుకు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకే వైసీపీ ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయిస్తోందని తెలుగుదేశం పార్టీ నాయకులు ధ్వజమెత్తారు. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా సోమవారం టీడీపీ నాయకులు దీక్షలు కొనసాగించారు.
సీతానగరం: మండలంలోని లచ్చయ్యపేట షుగర్ ఫ్యాక్టరీ వద్ద బాబుకు తోడుగా ఒక నియంతపై పోరాటం కోసం మేము సైతం రిలేదీక్షల్లో భాగంగా సోమవారం టీడీసీ మండల శాఖ ఆధ్వర్యంలో రైతులు, కార్యకర్తలు దీక్షను చేపట్టారు.ఈ సందర్భంగా పార్టీ నియోజకవర ్గ ఇన్‌చార్జి బోనెల విజయ్‌చంద్ర వైసీపీ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. రాష్ట్రంలోని అన్నిచోట్ల అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తుతున్నారని తెలిపారు. మహిళలు కూడా స్వచ్ఛందంగా ముందుకువచ్చి దీక్షల్లో పాల్గొంటున్నట్లు తెలిపారు.కార్యక్రమం లో టీడీపీ నాయకులు కొల్లి తిరుపతిరావు,రౌతు వేణుగోపాల్, పోల సత్యనారా యణ, గొట్టాను వెంకటనాయుడు, పెంకి వేణుగోపాల్ పాల్గొన్నారు. కురుపాం: టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమఅరెస్టుకు నిరసనగా సోమ వారం కురుపాంలో పార్టీ నియోజకవర్గం ఇన్‌చార్జి తోయక జగదీశ్వరి ఆధ్వ ర్యంలో తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ (టీఎన్‌ఎస్‌ఎఫ్) విభాగం నాయ కులు రిలేదీక్ష చేపట్టారు. కార్యక్రమంలో టీఎన్‌ఎస్‌ఎఫ్ మీడియా కోఆర్డినేటర్ సుకేష్ చంద్ర పండా, రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి కోలా రంజిత్ కుమార్, పార్టీ మండల కన్వీనర్లు కేవీ కొండయ్య, టీడీసీ అరకు పార్లమెంట్ ఎస్టీ సెల్ అధికార ప్రతినిధి నందివాడ కృష్ణబాబు, పార్టీ నాయకుడు బీహెచ్ వీ రమణకుమార్, కిమిడి రామరాజు, టీఎన్‌ఎస్‌ఎఫ్ ఉపాధ్యక్షులు పడాల శరత్, ముంజి హరీష్, కార్యదర్శి ఆచంటి విజయ్‌కుమార్, దేవయాని, భారతి, ప్రవీణ, ఐటీడీపీ ఛాంపియన్‌లు మీసాల ప్రశాంత్, మావుడి మురళి, ఆనంద్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
భామిని: రానున్న ఎన్నికల్లో టీడీపీ విజయం ఖాయమని ఆ పార్టీ నాయకులు తెలిపారు. సోమవారం భామినిలో బాబుకోసం మేము సైతం రిలే దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నాయ కులు మాట్లాడుతూ చంద్రబాబునాయుడు ఐటీ రంగంలో అభివృద్ధి చేసి తెలుగు వారికి ప్రపంచ దేశాల్లో ఉపాధి కల్పించారని, అటువం టి వ్యక్తికి సంకెళ్లు వేయడం నీచమైన చర్య అని తెలిపారు.