ప్రతి విద్యార్థికీ చదవడం, రాయడం రావాలి
ABN , First Publish Date - 2023-11-22T00:15:26+05:30 IST
విద్యలో ప్రగతి సాధించాలనుకున్న విద్యార్థులకు తప్పనిస రిగా చదవడం, రాయడం రావాలని, ఆ దిశగా ఉపాధ్యాయులు తమ బోధన సాగించా లని జిల్లా ఉప విద్యాశాఖాధికారి కంది వాసుదేవరావు సూచించారు.

చీపురుపల్లి: విద్యలో ప్రగతి సాధించాలనుకున్న విద్యార్థులకు తప్పనిస రిగా చదవడం, రాయడం రావాలని, ఆ దిశగా ఉపాధ్యాయులు తమ బోధన సాగించా లని జిల్లా ఉప విద్యాశాఖాధికారి కంది వాసుదేవరావు సూచించారు. చీపురుపల్లి బాలుర, మెట్టపల్లి ఉన్నత పాఠశాలల్లో అభ్యసనాభివృద్ధి కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న ఉపాధ్యాయ శిక్షణా కార్యక్రమాన్ని ఆయన మంగళారం తనిఖీచేశా రు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలామంది చదవడం, రాయడం రాకుండా పైతరగతులకు ఉత్తీర్ణులు అవుతున్నారని, అటువంటివారు ప్రగతి సాధించలేరని చెప్పారు. ఇటువంటి సమస్యను పరిష్కరించడం కోసం ఉపాధ్యా యులు సామర్థ్య ఆధారిత బోధనను చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డైట్ లెక్చరర్ ఎల్.రామకృష్ణ, ఏంఈవో బూసినాయుడు, విజయ్‌కుమార్, ఆర్పీలు కె.నాగేశ్వరరావు, కె.నాగరాజు, జనార్ధన, రమణ, ఉన్నత పాఠశాల హెచ్‌ఎం కె.చంద్రశేఖర్‌కుమార్, సీఆర్‌ఎంటీలు కంది రామకృష్ణ, పి.వినోద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.