Share News

జీతాలు చెల్లించక ఉద్యోగులకు ఇక్కట్లు

ABN , First Publish Date - 2023-12-11T00:20:20+05:30 IST

ఉమ్మడి విజయనగరం జిల్లాలో 11 మంది ఉపాధ్యాయులు, ఐదువేల మంది అవుట్‌సోర్సింగ్‌,కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు ఇప్పటికి జీతాలు చెల్లించక పోవడంతో ఇబ్బందులు పడుతున్నారని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎన్‌వై నాయుడు తెలిపారు. ఆదివారం సాలూరులో విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఉద్యోగులకు ఒకటో తేదీకి జీతాలివ్వకుండా వేధిస్తున్న ఘనత వైసీపీకే దక్కుతుందన్నారు. ఒకటో తేదీకి జీతాలు అనే విషయం ఉద్యోగ, ఉపాధ్యాయ, కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యో గులు, పెన్షనర్లు మరచిపోయారన్నారు. గతంలో ఒకటో తేదీకి జీతాలు, పింఛన్లు ఇవ్వకపోతే ప్రభుత్వాలు నామోషిగా భావించేవన్నారు. వైసీపీ ప్రభుత్వం పదో తేదీ దాటిన జీతాలివ్వకపోయిన సిగ్గుపడడం లేదన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ సైతం ఉద్యోగ,ఉపాధ్యాయులకు సకాలంలో జీతాలివ్వకుండా వేధించడం తగదన్నారు. పీఆర్సీ కమిటీ వేసిన దానికి అతీగతీ లేకుండా చేశారన్నారు. సీపీఎస్‌ రద్దుపై మడమ తిప్పారన్నారు. కార్యక్రమంలో ఈశ్వరరరావు,స్వప్న, రవి పాల్గొన్నారు.

జీతాలు చెల్లించక ఉద్యోగులకు ఇక్కట్లు

సాలూరు రూరల్‌: ఉమ్మడి విజయనగరం జిల్లాలో 11 మంది ఉపాధ్యాయులు, ఐదువేల మంది అవుట్‌సోర్సింగ్‌,కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు ఇప్పటికి జీతాలు చెల్లించక పోవడంతో ఇబ్బందులు పడుతున్నారని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎన్‌వై నాయుడు తెలిపారు. ఆదివారం సాలూరులో విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఉద్యోగులకు ఒకటో తేదీకి జీతాలివ్వకుండా వేధిస్తున్న ఘనత వైసీపీకే దక్కుతుందన్నారు. ఒకటో తేదీకి జీతాలు అనే విషయం ఉద్యోగ, ఉపాధ్యాయ, కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యో గులు, పెన్షనర్లు మరచిపోయారన్నారు. గతంలో ఒకటో తేదీకి జీతాలు, పింఛన్లు ఇవ్వకపోతే ప్రభుత్వాలు నామోషిగా భావించేవన్నారు. వైసీపీ ప్రభుత్వం పదో తేదీ దాటిన జీతాలివ్వకపోయిన సిగ్గుపడడం లేదన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ సైతం ఉద్యోగ,ఉపాధ్యాయులకు సకాలంలో జీతాలివ్వకుండా వేధించడం తగదన్నారు. పీఆర్సీ కమిటీ వేసిన దానికి అతీగతీ లేకుండా చేశారన్నారు. సీపీఎస్‌ రద్దుపై మడమ తిప్పారన్నారు. కార్యక్రమంలో ఈశ్వరరరావు,స్వప్న, రవి పాల్గొన్నారు.

Updated Date - 2023-12-11T00:20:22+05:30 IST