నేటి నుంచి దసరా సెలవులు
ABN , First Publish Date - 2023-10-14T00:11:13+05:30 IST
విద్యాశాఖ ఆదేశాల మేరకు జిల్లాలో పాఠశాలలకు డీఈవో నిమ్మక ప్రేమ్‌కుమార్ దసరా సెలవులు ప్రకటించారు.
సాలూరు రూరల్, అక్టోబరు 13: విద్యాశాఖ ఆదేశాల మేరకు జిల్లాలో పాఠశాలలకు డీఈవో నిమ్మక ప్రేమ్‌కుమార్ దసరా సెలవులు ప్రకటించారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు 1583 వరకు ఉండగా, వాటిన్నింటికీ ఈ నెల 14 నుంచి 24 వరకు దసరా సెలవులు వర్తించనున్నాయి. ఈ నెల 15న పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి కాగా ఆశ్రమ గిరిజన పాఠశాలల విద్యార్ధులు శుక్రవారం సాయంత్రం తమ సొంత గ్రామాలకు తరలివెళ్లారు.
20 నుంచి విశాఖకు అదనపు బస్సులు
దసరా పండగ నేపథ్యంలో జిల్లాలో సాలూరు, పార్వతీపురం, పాలకొండ ఆర్టీసీ డిపోల నుంచి ఈ నెల 20 నుంచి 27 వరకు విశాఖకు అదనపు బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ డీపీటీవో టీవీఎస్ సుధాకర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 21, 21 తేదీల్లో హైదరాబాద్ నుంచి పార్వతీపురం వరకు ప్రత్యేక బస్సులను నడుపు తున్నామన్నారు. ఈ బస్సుల్లో సాధారణ చార్జీలను వసూలు చేస్తామని పేర్కొన్నారు.