Share News

నలుపు దుస్తులు ధరించి ...

ABN , Publish Date - Dec 31 , 2023 | 12:31 AM

సీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణం నెరవేర్చాలని మున్సిపల్‌ పారిశుధ్య కార్మికులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సాలూరు మున్సిపల్‌ కార్యాలయం ఆవరణలో శిబిరం వద్ద నలుపు దుస్తులతో నిరసన తెలిపారు.

నలుపు దుస్తులు ధరించి ...
సాలూరులో నిరసన తెలుపుతున్న మున్సిపల్‌ కార్మికులు

సాలూరు, డిసెంబరు 30: వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణం నెరవేర్చాలని మున్సిపల్‌ పారిశుధ్య కార్మికులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సాలూరు మున్సిపల్‌ కార్యాలయం ఆవరణలో శిబిరం వద్ద నలుపు దుస్తులతో నిరసన తెలిపారు. సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గతంలో ఓట్ల కోసం ఎన్నో హామీలిచ్చిన వైసీపీ.. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పట్టించుకోకపోవడం ఎంతవరకు సమంజమని నాయకులు శంకర్‌, రాముడు ప్రశ్నించారు. తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చే వరకు సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

Updated Date - Dec 31 , 2023 | 12:31 AM