‘రైతులకు అన్యాయం చేయొద్దు’

ABN , First Publish Date - 2023-02-06T23:49:37+05:30 IST

ప్రభుత్వం పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని టీడీపీ మండల అధ్యక్షుడు కొండపల్లి భాస్కర్‌ నాయుడు అన్నారు.

‘రైతులకు అన్యాయం చేయొద్దు’

గంట్యాడ: ప్రభుత్వం పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని టీడీపీ మండల అధ్యక్షుడు కొండపల్లి భాస్కర్‌ నాయుడు అన్నారు. సోమవారం గంట్యాడలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రైతులు వద్ద ఉన్న ప్రతి గింజా కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. అందుకు ఈ నెల 8వ తేదీ ఉదయం 10 గంటలకు కొటారుబిల్లి నుంచి గంట్యాడ వరకూ ర్యాలీ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. దీనికి గజపతినగరం మాజీ ఎమ్మెల్యే కేఏ నాయుడు హాజరు కానున్నారని చెప్పారు. కార్యక్రమంలోని టీడీపీ నాయకులు బూడి అప్పలనాయుడు, రంధి చిన రామునాయుడు తదితరులు ఉన్నారు.

Updated Date - 2023-02-06T23:49:37+05:30 IST