Share News

జిల్లా రైతాంగాన్ని ఆదుకోవాలి

ABN , First Publish Date - 2023-12-11T00:58:52+05:30 IST

మిచౌంగ్‌ తుఫాను భారీ నష్టాన్ని మిగిల్చిందని, రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి కిమిడి కళావెంకటరావు డిమాండ్‌ చేశారు. ఆదివారం ఓ ప్రైవేటు హోటల్‌లో మాజీ ఎమ్మెల్యేలు పతివాడ నారాయణ స్వామి నాయుడు, డాక్టరు కేఏ నాయుడులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు.

జిల్లా రైతాంగాన్ని ఆదుకోవాలి
విలేకర్లతో మాట్లాడుతున్న కళావెంకటరావు

జిల్లా రైతాంగాన్ని ఆదుకోవాలి

మిచౌంగ్‌ భారీ నష్టాన్ని మిగిల్చింది

టీడీపీ సీనియర్‌ నేత కళా వెంకటరావు

విజయనగరం రూరల్‌, డిసెంబరు 10: మిచౌంగ్‌ తుఫాను భారీ నష్టాన్ని మిగిల్చిందని, రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి కిమిడి కళావెంకటరావు డిమాండ్‌ చేశారు. ఆదివారం ఓ ప్రైవేటు హోటల్‌లో మాజీ ఎమ్మెల్యేలు పతివాడ నారాయణ స్వామి నాయుడు, డాక్టరు కేఏ నాయుడులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. తుఫాను నష్టం బారెడు కాగా జిల్లా అధికార యంత్రాంగం నష్టాన్ని జానెడుగా చూపిస్తోందన్నారు. తుఫాను నష్టం అంచనా వేసే నిబంధనలు చాలా ఆశ్చర్యం కలిగిస్తున్నాయన్నారు. పంటపొలంలో నీరుంటేనే నష్ట పరిహారానికి అర్హతగా గుర్తించాలని చెప్పడం అన్యాయమన్నారు. సకాలంలో తోటపల్లి ప్రాజెక్టు నీరు ఇచ్చి ఉంటే తుఫాన్‌కు ముందే వరి పంట చేతికొచ్చేదన్నారు. ధాన్యం తడిచిపోవడంతో మొలకలు వచ్చాయని, వారి పరిస్థితి దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల నుంచి వెంటనే ప్రతి గింజ కొనుగోలు చేయాలని కోరారు. వైసీపీ నేతలు ఊక వ్యాపారం చేస్తూ కోట్లాది రూపాయలు ఆర్జిస్తుండగా రైతులు మాత్రం నష్టాల ఊబిలోకి వెళ్లిపోతున్నారన్నారు. అన్ని మండలాల్లోనూ వరి పంట దెబ్బతిందని, క్షేత్రస్థాయికి వెళ్లి వ్యవసాయాధికారులు ఖచ్చితమైన లెక్కలు నమోదు చేయాలన్నారు. సమావేశంలో టీడీపీ నాయకులు కంది మురళీనాయుడు, పి.అప్పలనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-12-11T00:58:54+05:30 IST