‘రాష్ట్రంలో విధ్వంసకర పాలన’

ABN , First Publish Date - 2023-02-06T23:48:50+05:30 IST

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం విధ్వంసకర పరిపాలన కొనసాగి స్తుందని పార్వతీపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జి బొబ్బిలి చిరంజీవులు అన్నారు.

‘రాష్ట్రంలో విధ్వంసకర పాలన’

సీతానగరం: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం విధ్వంసకర పరిపాలన కొనసాగి స్తుందని పార్వతీపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జి బొబ్బిలి చిరంజీవులు అన్నారు. సోమవారం అనంతరాయుడుపేట గ్రామంలో ‘ఇదేం ఖర్మ మన రాష్ర్టానికి’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇం టింటికీ వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుంద న్నారు. గతేడాది జరిగిన పరిణామానికి రైతులు భయాందోళనకు గురవుతు న్నారన్నారు. చెరకు రైతులను ప్రభుత్వం ఆదుకోని పంటను అందుబాటులో ఉన్న ఫ్యాక్టరీకి తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు కొల్లి తిరుపతిరావు, ప్రధాన కార్యదర్శి రౌతు వేణుగోపాలరావు, పార్టీ నాయకులు గొట్టాపు వెంకనాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-06T23:48:50+05:30 IST