పంచాయతీలకు నిధులు జమచేయండి

ABN , First Publish Date - 2023-03-02T00:10:28+05:30 IST

ప్రభుత్వం పంచాయతీలకు రావాలసిన నిధులను ఖాతాలకు జమ చేయడమే కాకుండా ఆ నిధులతో అభివృద్ధి పనులు చేపట్టడానికి అనుమతులు జారీచేయాలని టీడీపీ సర్పంచ్‌ల సంఘ మండలాధ్యక్షుడు, ఒమ్మి సర్పంచ్‌ వంగా వెంకటరావు ఒక ప్రకటనలో డిమాండ్‌చేశారు.

 పంచాయతీలకు నిధులు జమచేయండి

రాజాం: ప్రభుత్వం పంచాయతీలకు రావాలసిన నిధులను ఖాతాలకు జమ చేయడమే కాకుండా ఆ నిధులతో అభివృద్ధి పనులు చేపట్టడానికి అనుమతులు జారీచేయాలని టీడీపీ సర్పంచ్‌ల సంఘ మండలాధ్యక్షుడు, ఒమ్మి సర్పంచ్‌ వంగా వెంకటరావు ఒక ప్రకటనలో డిమాండ్‌చేశారు. వైసీపీ ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సర్పంచ్‌ వ్యవస్థ నాశన మవుతోందని ఆందోళన వ్యక్తంచేశారు. వైసీపీ ప్రభుత్వం పంచాయతీలకు నిధులు మంజూరు చేయడంలేదని, అకౌంట్‌ లో ఉన్న నిధులను సర్పంచ్‌ల అనుమతులు లేకుండా వెనక్కు తీసుకుంటోందని ఆరోపించారు. ఉపాధి పథకం నుంచి మ్యాచింగ్‌ గ్రాంట్‌ సర్పంచ్‌ల ఖాతాలకు జమచేయకుండా ప్రభుత్వం భవనాలకు ఖర్చు చేస్తోందని ఆరోపించారు. 15వ ఆర్థికసంఘం నిధులు విద్యుత్‌ బిల్లులు, మంచి నీటి సౌకర్యం, గ్రామ సచివా లయాల సామగ్రిని కొనుగోలుకు వినియోగిస్తోందని తెలిపారు.

Updated Date - 2023-03-02T00:10:28+05:30 IST