‘ఉపాధి’లో లోపాలుంటే చర్యలు
ABN , First Publish Date - 2023-09-22T23:43:50+05:30 IST
ఉపాధి హామీ పథకంలో లోపాలు ఉంటే చర్యలు తప్పవని ఉపాధి హామీ పథకం రాష్ట్ర బృంద సభ్యులు పి.జానకీరావు, కె.సుధీర్ తెలిపారు.
గరుగుబిల్లి, సెప్టెంబరు 22 : ఉపాధి హామీ పథకంలో లోపాలు ఉంటే చర్యలు తప్పవని ఉపాధి హామీ పథకం రాష్ట్ర బృంద సభ్యులు పి.జానకీరావు, కె.సుధీర్ తెలిపారు. శుక్రవారం చినగుడబ, గొట్టివలస, తోటపల్లిలో ఉపాధి నిధులతో చేపట్టిన మొక్కలు, పండ్ల తోటల పెంపకం, వర్షం నీటి నిల్వ ప్రాంతాలను పరిశీలించారు. రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లాలోని పలు మండలాల్లో గతంలో ఉపాధి పథకంలో చేపట్టిన వివిధ రకాల పనులను పరిశీలించనున్నామన్నారు. అవి రైతులకు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయన్న దానిపై సమాచారం సేకరిస్తున్నామని తెలిపారు. ఈ పరిశీలనలో ఉపాధి హామీ ఏపీడీ జి.శ్రీహరిరావు, ఏపీఎం ఎం.గౌరీనాథ్, ఈసీ గోపాలకృష్ణ పట్నాయక్, టెక్నికల్ అసిస్టెంట్లు, క్షేత్ర సహాయకులు పాల్గొన్నారు.