Share News

సాగు హక్కు కల్పించాలి

ABN , First Publish Date - 2023-11-06T23:38:46+05:30 IST

దేవదాయ భూములను సాగు చేసుకుంటున్న కౌలురైతులకు సాగు హక్కు కల్పించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని పాతశ్రీరంగ రాజపురం, కొత్తశ్రీరంగరాజపురం గ్రామాలకు చెందిన రైతులు ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్యను కోరారు.

 సాగు హక్కు కల్పించాలి

గజపతినగరం: దేవదాయ భూములను సాగు చేసుకుంటున్న కౌలురైతులకు సాగు హక్కు కల్పించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని పాతశ్రీరంగ రాజపురం, కొత్తశ్రీరంగరాజపురం గ్రామాలకు చెందిన రైతులు ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్యను కోరారు. సోమవారం స్థానిక వైసీపీ కార్యాలయంలో ఆయనకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈసందర్భంగా కెల్ల అప్పలనాయుడు, మీసాల లక్ష్ము నాయుడు, లెంక అప్పారావు తదితర రైతులు మాట్లాడుతూ గ్రామాల్లో గత 50 ఏళ్లుగా సీతారామస్వామి దేవాలయానికి చెందిన భూములను సాగు చేసుకుంటు న్నామని అయితే ఇటీవల దేవస్థాన అధికారులు రబీ పంటకు భూములు సాగు చేయవద్దని, వేలం నిర్వహిస్తామని చెప్పడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు తెలిపారు. వేలంపాట నిలిపివేయాలని పూర్వం నుంచి కౌలు చేస్తున్న రైతులకు భూమి సాగు హక్కులు కల్పించాలన్నారు. ఇందుకు ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య మాట్లాడుతూ దేవదాయ శాఖ కమిషనర్‌తో మాట్లాడి సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రెండు గ్రామాల రైతులు, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-06T23:38:48+05:30 IST