రాష్ట్రస్థాయి ఉత్తమ బీఎల్‌వోగా సౌజన్య

ABN , First Publish Date - 2023-01-26T00:31:35+05:30 IST

బూత్‌ స్థాయిలో ఉన్నత సేవలు అందించిన పాలకొండ మండలం అంపిలి గ్రామ సచివాలయంలో వీఆర్వోగా పనిచేస్తున్న లావేటి సౌజన్య రాష్ట్ర స్థాయి లో ఉత్తమ బీఎల్‌వోగా ఎంపి కయ్యారు.

రాష్ట్రస్థాయి ఉత్తమ బీఎల్‌వోగా సౌజన్య
అవార్డు అందుకున్న సౌజన్య

పాలకొండ: బూత్‌ స్థాయిలో ఉన్నత సేవలు అందించిన పాలకొండ మండలం అంపిలి గ్రామ సచివాలయంలో వీఆర్వోగా పనిచేస్తున్న లావేటి సౌజన్య రాష్ట్ర స్థాయి లో ఉత్తమ బీఎల్‌వోగా ఎంపి కయ్యారు. ఈ మేరకు బుధ వారం ఓటర్ల దినోత్సవం సందర్భంగా విజయవాడలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా నుంచి ఈ అవార్డును అందుకున్నారు. రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో బిఎల్‌వో సౌజన్య సేవలను కొనియాడారు. ఈమె అంపిలి గ్రామ సచివాలయంలో 201 బీఎల్‌వోగా సేవలను అందిస్తున్నారు. ఈమెకు అవార్డు రావడంపై మన్యం జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌, వివిధ శాఖల అధికారులు అభినందించారు. కాగా సౌజన్య విజయవాడ వెళ్లడంతో ఆమె తరఫున పాలకొండ మండలంలో వీఆర్వోగా పనిచేస్తున్న ధనలక్ష్మికి ప్రశంసాపత్రం అందించారు.

Updated Date - 2023-01-26T00:31:37+05:30 IST