తోటపల్లి హుండీల లెక్కింపు
ABN , Publish Date - Dec 30 , 2023 | 12:20 AM
ఉత్తరాంధ్రలో ప్రసిద్ధిగాంచిన తోటపల్లి శ్రీవెంకటేశ్వర, కోదండరామస్వామి ఆలయాల్లో శుక్రవారం హుండీల లెక్కింపు నిర్వహించారు.
గరుగుబిల్లి: ఉత్తరాంధ్రలో ప్రసిద్ధిగాంచిన తోటపల్లి శ్రీవెంకటేశ్వర, కోదండరామస్వామి ఆలయాల్లో శుక్రవారం హుండీల లెక్కింపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో వీవీ సూర్యనారాయణ మాట్లాడుతూ అక్టోబరు 5 నుంచి కానుకల రూపంలో అందించిన మొత్తాలను లెక్కించినట్టు చెప్పారు. శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి రూ.4,47,605, శ్రీకోదండరామస్వామి ఆలయా నికి రూ.11,152 వచ్చిందన్నారు. ఈ లెక్కింపు కార్యక్రమంలో పాలకొండ గ్రూపు దేవాలయాల కార్యనిర్వహణాధికారి సర్వేశ్వరరావు, చైర్మన్ ఎం.సత్యనారాయణ, సభ్యులు గౌరీశంకర్ పాత్రో, కె.సాగర్, సిబ్బంది గంట శ్రీధర్‌తో పాటు శ్రీవారి సేవకులు పాల్గొన్నారు.