ట్రాన్స్‌ఫార్మర్‌కు కనెక్షన్‌ ఏర్పాటు

ABN , First Publish Date - 2023-05-25T23:58:39+05:30 IST

రామలింగపురం గ్రామంలో విద్యుత్‌ సమస్యను పరిష్క రించినట్టు ఏఈ అప్పారావు తెలిపారు. మంగళవారం ‘ఆంధ్రజ్యోతి’లో ‘ట్రాన్స్‌ఫార్మర్‌ వేశారు... కనెక్షన్‌ మరిచారు’ శీర్షికతో వచ్చిన వార్తపై విద్యుత్‌ శాఖ అధికారులు స్పందించారు

ట్రాన్స్‌ఫార్మర్‌కు కనెక్షన్‌ ఏర్పాటు

కొత్తవలస, మే 25: రామలింగపురం గ్రామంలో విద్యుత్‌ సమస్యను పరిష్క రించినట్టు ఏఈ అప్పారావు తెలిపారు. మంగళవారం ‘ఆంధ్రజ్యోతి’లో ‘ట్రాన్స్‌ఫార్మర్‌ వేశారు... కనెక్షన్‌ మరిచారు’ శీర్షికతో వచ్చిన వార్తపై విద్యుత్‌ శాఖ అధికారులు స్పందించారు. ఓవర్‌లోడ్‌ కారణంగా కొన్ని ప్రాంతాలలో రాత్రి 9 గంటల తరువాత విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలుగుతుండడంతో సుమారు నెల రోజుల కిందటే సింగిల్‌ ఫేజ్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేశారు. దీనికి కనెక్షన్‌ ఇవ్వకపోవడంతో సమస్య పరిష్కారం కాలేదు. ఇదే విషయమై ‘ఆంధ్రజ్యోతి’లో వార్త రావడంతో 16 కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్‌కు సంబంధించి కనెక్షన్‌ ఇస్తున్నట్టు ఏఈ అప్పారావు తెలిపారు. ఇకపై విద్యుత్‌ కోత సమస్య ఉండదని ఆయన అన్నారు.

Updated Date - 2023-05-25T23:58:39+05:30 IST