ఏఆర్ కానిస్టేబుల్ సన్యాసినాయుడుకు అభినందనలు
ABN , First Publish Date - 2023-09-22T00:09:31+05:30 IST
అంతర్జాతీయ మాస్టర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ ఫోల్‌వాల్ట్‌లో పతకం సాధించిన ఏఆర్ కానిస్టేబుల్ పి.సన్యాసి నాయుడు ఎస్పీ దీపికా గురువారం ఆమె కార్యాలయంలో అభినందించారు.
విజయనగరం క్రైం, సెప్టెంబ రు 21: అంతర్జాతీయ మాస్టర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ ఫోల్‌వాల్ట్‌లో పతకం సాధించిన ఏఆర్ కానిస్టేబుల్ పి.సన్యాసి నాయుడు ఎస్పీ దీపికా గురువారం ఆమె కార్యాలయంలో అభినందించారు. శ్రీలంక దేశంలోని దియాగమ మహీంద్ర రాజపక్ష స్టేడియంలో ఈ నెల 19 నుంచి 21 జరిగిన అంతర్జాతీయ మాస్టర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షీప్-2023 క్రీడా పోటీల్లో ఎఆర్ విభాగంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సన్యాసినాయుడు విశేష ప్రతిభ కనబరిచి రజత పతకం సా ధించారు. ఎస్పీ దీపికాను సన్యాసినాయుడిని మర్యాదపూర్వకంగా కలవగా అభి నందించి, క్రీడా ప్రతిభను ప్రశంసించారు. ఏఆర్ డీఎస్పీ యూని వర్స్, ఆర్‌ఐలు రమణమూర్తి, గోపాలనాయుడు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.