ఇప్పలవలస ఎఫ్‌ఏ నియామకంపై ఫిర్యాదు

ABN , First Publish Date - 2023-06-26T23:49:27+05:30 IST

ఇప్పలవలస ఉపాధి హామీ ఫీల్డ్‌ అసిస్టెంట్‌ నియామకంలో అధికారులు నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపిస్తూ ఆ గ్రామ సర్పంచ్‌ గెద్ద పైడిరాజు, సీనియర్‌ మేట్‌ వసంత సహా వేతనదారులు, గ్రామస్థులు సోమవారం స్పందనలో కలెక్టర్‌ నాగలక్ష్మికి ఫిర్యాదు చేశారు.

ఇప్పలవలస ఎఫ్‌ఏ నియామకంపై ఫిర్యాదు

మెంటాడ: ఇప్పలవలస ఉపాధి హామీ ఫీల్డ్‌ అసిస్టెంట్‌ నియామకంలో అధికారులు నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపిస్తూ ఆ గ్రామ సర్పంచ్‌ గెద్ద పైడిరాజు, సీనియర్‌ మేట్‌ వసంత సహా వేతనదారులు, గ్రామస్థులు సోమవారం స్పందనలో కలెక్టర్‌ నాగలక్ష్మికి ఫిర్యాదు చేశారు. గతంలో ఫీల్డ్‌ అసిస్టెంట్‌గా పనిచేసిన సీతంనాయుడు సుమారు రూ.5లక్షలు అవినీతికి పాల్పడ్డారని ఫిర్యాదు లో పేర్కొన్నారు. ఆయన స్థానంలో ఎటువంటి అర్హత లేని అతని భార్య వేపాడ పద్మను నియమించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. గ్రామంలో సీనియర్‌ మేట్లను కాదని ఆమె నియామకం ముమ్మాటికీ అధికార దుర్వినియోగమేనని ఆక్షేపించారు. డ్వామా పీడీ, స్థానిక ఎంపీడీవో ఈ విషయంలో రాజకీయ జోక్యానికి ప్రభావితమైనట్టు అనుమానిస్తున్నామని ఫిర్యాదులో పేర్కొన్నారు. పద్మ నియామకాన్ని రద్దు చేసి, పైన పేర్కొన్న ఇద్దరు అధికారులపై చర్యలు తీసుకోవాలని సర్పంచ్‌ గెద్ద పైడిరాజు, గ్రామస్థులు డిమాండ్‌ చేశారు. కలెక్టర్‌ స్పందిస్తారని ఆశిస్తున్నామని, లేని పక్షంలో న్యాయ పోరాటానికి సిద్ధమవుతామని టీడీపీ మండల అధ్యుక్షుడు చలుమూరి వెంకటరావు, పార్టీ నాయకుడు గెద్ద అన్నవరం స్పష్టం చేశారు.

Updated Date - 2023-06-26T23:49:27+05:30 IST