యువగళం ముగింపు సభకు తరలిరండి
ABN , Publish Date - Dec 17 , 2023 | 12:03 AM
భో గాపురం వద్ద పోలిపల్లి భూ మాతా ఎస్టేట్‌లో ఈ నెల 20న జర గనున్న టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం ము గింపుసభలో అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొనేలా సహకరించా లని నియోజకవర్గ ఇన్‌చార్జి కోండ్రు మురళీమోహన్ పిలుపునిచ్చారు.
రాజాం, డిసెంబరు 16: భో గాపురం వద్ద పోలిపల్లి భూ మాతా ఎస్టేట్‌లో ఈ నెల 20న జర గనున్న టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం ము గింపుసభలో అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొనేలా సహకరించా లని నియోజకవర్గ ఇన్‌చార్జి కోండ్రు మురళీమోహన్ పిలుపునిచ్చారు. సంతకవిటి మండల కేంద్రంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభి మానులతో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మండల, గ్రామ స్థాయి నాయకులు చొరవ తీసుకొని ప్రతి గ్రామం నుంచి అధిక సంఖ్యలో అభిమానులు, కార్య కర్తలు పాల్గొనేలా చూడాలన్నారు. భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం అన్ని గ్రామాల్లో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కొల్ల అప్పలనా యుడు, మండల పార్టీ అధ్యక్షుడు గట్టి భాను, వల్లూరు గణేశ్, మొయ్యి నారాయణప్పడు నా య కులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
శృంగవరపుకోట: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేప ట్టిన యువగళం పా దయాత్ర ముగింపు సభకు ఎస్.కోట మండలం నుంచి భారీగా జనం తరలి వచ్చేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని విశాఖ పార్లమెంటు పార్టీ ఉపాధ్య క్షుడు రాయవరపు చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. శనివారం పార్టీ రాష్ట్ర కార్య దర్శి గొంప కృష్ణ కార్యాలయంలో మండల కార్యకర్తలతో సమావేశ మయ్యా రు. ఈ నెల 20న భోగాపురంలోని భూమాత లేఅవుట్‌లో జరగనున్న ఈ సభకు మండలం నుంచి 5వేల మందిని తీసుకెళతామని చేప్పారు. మండల పార్టీ కార్యదర్శి జుత్తాడ రామసత్యం తదితరులు పాల్గొన్నారు.