మాట తప్పిన ముఖ్యమంత్రి

ABN , First Publish Date - 2023-09-23T00:12:58+05:30 IST

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి మాట తప్పారని సిటు జిల్లా కార్యదర్శి సిహెచ్‌. రా మ్మూర్తినాయుడు ఆరో పించారు. మాటతప్పని మడమ తిప్పని ముఖ్య మంత్రిగా చేసుకుంటున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు.

మాట తప్పిన ముఖ్యమంత్రి

రాజాం రూరల్‌: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి మాట తప్పారని సిటు జిల్లా కార్యదర్శి సిహెచ్‌. రా మ్మూర్తినాయుడు ఆరో పించారు. మాటతప్పని మడమ తిప్పని ముఖ్య మంత్రిగా చేసుకుంటున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. రాజాం మున్సిపల్‌ కార్యాలయం ఎదుట శుక్ర వారం మున్సిపల్‌ కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు నల్లబ్యాడ్జిలతో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మున్సిపల్‌ ఉద్యోగులు, కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందికి సమానపనికి సమాన వేతనం ఇస్తామని, కార్మికులందరినీ పర్మినెంట్‌ చేస్తామని ఇచ్చిన మాట మరచిపోయారని ఆరోపించారు. ముఖ్యమంత్రి గా అధికారంలోనికి వచ్చిన నాలుగున్నరేళ్లు పూర్తయినా ఆయన హామీ అమలుకు నోచుకోలేదని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్‌ కార్మికుల సమస్యలు పరి ష్కారం చేయకపోతే రాష్ట్రవ్యాప్త ఆంధోళనకు దిగుతామని హెచ్చరించారు. యూని యన్‌ నాయకులు గురువులు, శ్రీనివాసరావు, అనిల్‌ కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-09-23T00:12:58+05:30 IST