కోళ్లఫారం దగ్ధం
ABN , First Publish Date - 2023-01-15T00:08:15+05:30 IST
పతివాడ పంచాయతీలోగల రాయుడుపేట గ్రామంలో నమ్మి రమణకు చెందిన కోళ్లఫారం శుక్రవారం అర్ధరాత్రి అగ్నికి ఆహుతయ్యింది.
పూసపాటిరేగ: పతివాడ పంచాయతీలోగల రాయుడుపేట గ్రామంలో నమ్మి రమణకు చెందిన కోళ్లఫారం శుక్రవారం అర్ధరాత్రి అగ్నికి ఆహుతయ్యింది. అర్ధరాత్రి విద్యుత్ షార్ట్ షర్య్కూట్ కారణంగా ఈ అగ్ని ప్రమాదం సంభవించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ అగ్ని ప్రమాదంలో మూడు షెడ్లు, సుమారు 2వేలకు పైగా కోడి పిల్లలు కాలిపోయినట్లు బాధితుడు తెలుపుతున్నారు. దీంతో పాటు కోళ్ల దాణా, మరి కొంత సామగ్రి దగ్ధమయిట్లు చెప్పారు. బాధితుడిని టీడీపీ నాయకులు మహంతి చిన్నంనాయుడు, ఆకిరి ప్రసాదరావు, పతివాడ తమ్మినాయుడు తదితరులు పరామర్శించారు.