చీపురుపల్లి టీడీపీ నేతలతో నేడు చంద్రబాబు సమావేశం
ABN , First Publish Date - 2023-07-26T00:24:42+05:30 IST
చీపురుపల్లి నియోజకవర్గ టీడీపీ నాయకులతో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బుధవారం ఉదయం 10.30 గంటలకు పార్టీ రాష్ట్ర కార్యాలయం (విజయవాడ)లో సమావేశం కానున్నారు.
చీపురుపల్లి టీడీపీ నేతలతో
నేడు చంద్రబాబు సమావేశం
విజయనగరం రూరల్, జూలై 25: చీపురుపల్లి నియోజకవర్గ టీడీపీ నాయకులతో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బుధవారం ఉదయం 10.30 గంటలకు పార్టీ రాష్ట్ర కార్యాలయం (విజయవాడ)లో సమావేశం కానున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. అన్ని నియోజకవర్గ నాయకులతో మాట్లాడుతున్న చంద్రబాబు.. తాజాగా చీపురుపల్లి నియోజకవర్గ నేతలతో సమావేశం అయ్యేందుకు నిర్ణయించారు. పార్టీ నుంచి సమాచారం అందుకున్న టీడీపీ నేతలు మంగళవారం సాయంత్రం రోడ్డు మార్గాన విజయవాడకు పయనమయ్యారు. కిమిడి నాగార్జునతో పాటు పార్టీ మండలాల అధ్యక్ష, కార్యదర్శులు, క్లస్టర్ ఇన్‌చార్జిలు వెళ్లారు. సమీక్షలో ఇదేమి ఖర్మ రాష్ట్రానికి, భవిష్యత్తుకు భరోసా బస్సు యాత్ర, ఓటర్ ఐడెంటిఫికేషన్, వెరిఫికేషన్ (ఆఫ్‌లైన్, ఆన్‌లైన్), బీఎల్‌ఏల నియామకం తదితర అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఎన్నికల్లో చీపురుపల్లి నియోజకవర్గంలో పార్టీ విజయానికి ఏమి చేయాలన్న దానిపై దిశానిర్దేశం చేయనున్నారు.
----------