అశోక్‌కు చంద్రబాబు శుభాకాంక్షలు

ABN , First Publish Date - 2023-06-26T23:59:18+05:30 IST

టీడీపీ సీనియర్‌ నేత అశోక్‌ గజపతిరాజు పుట్టినరోజు సందడిగా సాగింది. అశోక్‌ బంగ్లా సోమవారం కోలాహలంగా మారింది. నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన కేక్‌ను అశోక్‌ గజపతిరాజు కట్‌ చేశారు.

అశోక్‌కు చంద్రబాబు శుభాకాంక్షలు

నగరంలో టీడీపీ సీనియర్‌ నేత పుట్టినరోజు సందడి

విజయనగరం రూరల్‌, జూన్‌ 26: టీడీపీ సీనియర్‌ నేత అశోక్‌ గజపతిరాజు పుట్టినరోజు సందడిగా సాగింది. అశోక్‌ బంగ్లా సోమవారం కోలాహలంగా మారింది. నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన కేక్‌ను అశోక్‌ గజపతిరాజు కట్‌ చేశారు. అనంతరం పార్టీ నాయకులకు పంపిణీ చేశారు. పుట్టినరోజును పురస్కరించుకుని విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. నగరంలోని పేర్లవారి వీధిలో ఉన్న విభిన్న ప్రతిభావంతుల స్కూల్‌లో చదువుతున్న విద్యార్థులను ఏడాది పాటు టీడీపీ నాయకులు దత్తత తీసుకున్నారు. ఏడాదిలో ఒక్కొక్కరికీ అయ్యే వ్యయం రూ.7,500 చొప్పున 25 మంది విద్యార్థుల పేరున చెల్లించారు. అనంతరం ప్రేమసమాజంలో పార్టీ నగర అధ్యక్షుడు ప్రసాదుల లక్ష్మీవరప్రసాద్‌ ఆధ్వర్యంలో వృద్ధులకు అల్పాహారం అందించారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రత్యేక వంటకాలతో భోజనాన్ని కూడా ఏర్పాటు చేశారు. నగరంలోని సిటీబస్టాండ్‌లో వున్న సిద్ది, బుద్ది వినాయక స్వామి ఆలయం, పైడిమాంబ ఆలయంలో అశోక్‌ గజపతిరాజు, సునీలా గజపతిరాజు ప్రత్యేక పూజలు చేశారు. ఆయన నివాసంలో ఉదయం 7.30 గంటలకు సింహాచలం దేవస్థానం, పైడిమాంబ దేవస్థానం నుంచి వచ్చిన అర్చకులు ఆశ్వీరచనం అందించారు.

శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఫోన్‌ చేసి అశోక్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రులు యనమల రామకృష్డుడు, కళా వెంకటరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడుతో పాటు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఫోన్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

-----------------

Updated Date - 2023-06-26T23:59:18+05:30 IST