చంద్రబాబు సీఎం కావాలి
ABN , First Publish Date - 2023-12-11T00:21:46+05:30 IST
చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తేనే ప్రజల భవిష్యత్‌కు గ్యారెంటీ ఉంటుందని తెలుగుదేశం పార్టీ నాయకులు తెలిపారు. ఆదివారం ఉమ్మడి జిల్లాలో బాబూ ష్యూరిటీ భవిష్యత్‌కు గారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి కరపత్రాలు అందజేశారు. బాండ్లు పంపిణీచేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే అమలుచేసే పథకాలు వివరించారు. వైసీపీప్రభుత్వ వైఫలాలను తెలియజేస్తూ ప్రచారం నిర్వహించారు.

రైతు కన్నీరే జగన్‌కు శాపం
లక్కవరపుకోట: తుఫాన్ వల్ల పంటలను నష్టపోయిన రైతుల కన్నీటి ఉసురే జగన్‌కు శాపంగా మారి ఇంటికి వెళ్లేలా చేస్తుందని ఎస్.కోట నియోజ కవర్గ మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి ఆరోపించారు. మండలంలోని భీమాలిలో బాబు ష్యూరిటీ-భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమాన్ని నియోజకవర్గ పరిశీలకుడు చౌదరి నారాయణమూర్తితో కలిసి నిర్వహించారు. ఈసందర్భంగా లలితకుమారి మాట్లాడుతూ రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు ముఖ్యమం త్రిగా రావాలన్నారు. చౌదరి నారాయణమూర్తి మాట్లాడుతూ ఎస్.కోట నియో జకవర్గాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించి చంద్రబాబును కానుకగా ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కేబీఏ రాంప్రసా ద్, టీడీపీ మండలా ధ్యక్షుడు చొక్కాకుల మల్లునాయుడు, జడ్పీటీసీ మాజీ సభ్యుడు కరెడ్ల ఈశ్వరరావు, మాజీ ఎంపీపీ కొల్లు రమణమూర్తి, జి.రాము నాయుడు, ప్రసాద్, జనసేన నాయకులు పాల్గొన్నారు.
అప్పన్నగూడలో..
సీతంపేట: ముఖ్యమంత్రిగా మళ్లీ చంద్రబాబునాయుడు రావాల్సిన అవ సరం ఎంతైనా ఉందని టీడీపీ పాలకొండ నియోజకవర్గ ఇన్‌చార్జి నిమ్మక జయకృష్ణ కోరారు. మండలలోని కిల్లాడ పంచాయతీ పరిధిలో జగ్గడగూడ, అప్పన్నగూడ, చింతమానుగూడ, డంజుపాయి, కిల్లాడల్లో ఆదివారం బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మినీ మ్యానిఫెస్టోలోని సూపర్‌సిక్స్ అంశాలను వివరించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ ఆరిక సువర్ణ, భవిష్యత్తు గ్యారెంటీ ప్రచారకర్త తోయిక సంధ్యారాణి, సవర సొడంగి, ఆరిక ఆనంద్, యూనిట్ ఇన్‌చార్జి బిడ్డి ప్రవీణ్‌సాయి, మూటక భరత్‌రాజ్, ఆరిక వరలక్ష్మి పాల్గొన్నారు.