జీవో 1 రద్దు కోసం 20న ‘చలో అసెంబ్లీ’

ABN , First Publish Date - 2023-03-18T06:40:32+05:30 IST

రాష్ట్రంలో ప్రతిపక్షాలు నిర్వహించే ధర్నాలు, నిరసన ప్రదర్శనలు, ఆందోళనలను అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవో 1ను రద్దు చేయాలని ఈనెల 20న నిర్వహిస్తున్న ‘చలో అసెంబ్లీ’ని జయప్రదం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, టీడీపీ పాలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య పిలుపునిచ్చారు.

జీవో 1 రద్దు కోసం 20న ‘చలో అసెంబ్లీ’

జయప్రదం చేయాలని సీపీఐ రామకృష్ణ, వర్ల రామయ్య పిలుపు

విజయవాడ(ధర్నాచౌక్‌), మార్చి 17: రాష్ట్రంలో ప్రతిపక్షాలు నిర్వహించే ధర్నాలు, నిరసన ప్రదర్శనలు, ఆందోళనలను అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవో 1ను రద్దు చేయాలని ఈనెల 20న నిర్వహిస్తున్న ‘చలో అసెంబ్లీ’ని జయప్రదం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, టీడీపీ పాలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య పిలుపునిచ్చారు. అఖిల భారత యువజన సమాఖ్య రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో విజయవాడ గాంధీనగర్‌లోని ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం నిర్వహించిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల గొంతు నొక్కుతూ భావప్రకటనా స్వేచ్ఛను హరిస్తున్నారని, పోలీస్‌ వ్యవస్థ ద్వారా నిర్బంధకాండ అమలుచేస్తున్నారని, దీన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత పార్టీలు, ప్రజా సంఘాలపై ఉందని పిలుపునిచ్చారు.

Updated Date - 2023-03-18T06:40:32+05:30 IST