ఆదరణ చూసి ఓర్వలేకే చంద్రబాబుపై కేసులు
ABN , First Publish Date - 2023-09-26T00:10:16+05:30 IST
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు వస్తు న్న ఆదరణ చూసి ముఖ్య మంత్రి జగన్ ఓర్వలేకే కేసులు బనాయి స్తున్నారని టీడీపీ సీని యర్ నాయకురాలు, మాజీ స్పీకర్ ప్రతిభాభారతి ఆరోపించా రు.

వంగర : టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు వస్తు న్న ఆదరణ చూసి ముఖ్య మంత్రి జగన్ ఓర్వలేకే కేసులు బనాయి స్తున్నారని టీడీపీ సీని యర్ నాయకురాలు, మాజీ స్పీకర్ ప్రతిభాభారతి ఆరోపించా రు. కొప్పర, కొప్పర వలసలో పలువురు టీడీపీ కార్యకర్తలు అనారోగ్యం బారిన పడడంతో వారిని సోమవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె విలే కరుల తో మాట్లాడుతూ కుట్రలు, కుతంత్రాలతో ఎంతో కాలం మనుగడ సాధించలే మన్నా రు. నిరాధారమైన కేసులు కోర్టులో నిలబడవని, చంద్రబాబు కడిగిన ము త్యంలా బయటకు వస్తారని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పైల వెంకటర మణ, త్రినాథ, గంటపద్మ, పైడిపినాయుడు, గణపతి పాల్గొన్నారు.