జాతీయ సేవా దళం కార్యకర్తలకు పిలుపు

ABN , First Publish Date - 2023-03-19T00:02:38+05:30 IST

జాతీయ సేవాదళం కార్యకర్తలుగా పనిచేసేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నెహ్రూ యువ కేంద్ర జిల్లా యువ అధికారి కె.వెంకట్‌ ఉజ్వల్‌ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.

జాతీయ సేవా దళం కార్యకర్తలకు పిలుపు

పార్వతీపురం, మార్చి 18(ఆంధ్రజ్యోతి): జాతీయ సేవాదళం కార్యకర్తలుగా పనిచేసేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నెహ్రూ యువ కేంద్ర జిల్లా యువ అధికారి కె.వెంకట్‌ ఉజ్వల్‌ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని బాడంగి, బొబ్బిలి, భోగాపురం, చీపురుపల్లి, గజపతినగరం, గంట్యాడ, నెల్లిమర్ల, రాజాం, ఎస్‌.కోట, వియ్యంపేట, భద్రగిరి, కురుపాం, పాచిపెంట, పాలకొండ, పార్వతీపురం, సాలూరు, సీతంపేట, వీరఘట్టంలో సేవాభావంతో పనిచేయాల్సి ఉంటుందన్నారు. 2023, ఏప్రిల్‌ 1 నాటికి 18 నుంచి 29 సంవత్సరాల లోపు వారు అర్హులని, టెన్త్‌ విద్యార్హత తప్పనిసరి అని చెప్పారు. 2025, మార్చి 31 నాటికి పూర్తయ్యే కాలానికి ఈ నియామకం ఉంటుందని పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు గౌరవవేతనంగా రూ.5వేలు చెల్లించనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు ఈ నెల 24లోగా ఆన్‌లైన్‌ లేదా నేరుగా కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. పూర్తి వివరాలకు విజయనగరంలో జిల్లా యువ అధికారి నెహ్రూ యువ కేంద్ర కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు.

Updated Date - 2023-03-19T00:02:38+05:30 IST