అద్దెల భారం

ABN , First Publish Date - 2023-02-15T00:21:31+05:30 IST

రైతులే నేరుగా తమ వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించేందుకు రైతుబజార్లను ఏర్పాటుచేశారు. పూర్తి సేవా దృక్పధంతో 1999లో టీడీపీ ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా ఏడు రైతుబజార్లను ఏర్పాటుచేసింది. సమీప గ్రామాలకు చెందిన రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించేందుకు వీలుగా షాపులను ఏర్పాటుచేశారు. మార్కెటింగ్‌ శాఖ నిర్వహణలో 7 రైతుబజార్లలో మొత్తం 300 వరకూ షాపులు ఉన్నాయి.

అద్దెల భారం

అద్దెల భారం

రైతుబజార్లలో షాపుల అద్దె పెంపు

చెల్లించలేమంటున్న రైతులు

నిర్వహణకు తప్పదంటున్న అధికారులు

విజయనగరం (ఆంధ్రజ్యోతి) ఫిబ్రవరి 14: రైతులే నేరుగా తమ వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించేందుకు రైతుబజార్లను ఏర్పాటుచేశారు. పూర్తి సేవా దృక్పధంతో 1999లో టీడీపీ ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా ఏడు రైతుబజార్లను ఏర్పాటుచేసింది. సమీప గ్రామాలకు చెందిన రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించేందుకు వీలుగా షాపులను ఏర్పాటుచేశారు. మార్కెటింగ్‌ శాఖ నిర్వహణలో 7 రైతుబజార్లలో మొత్తం 300 వరకూ షాపులు ఉన్నాయి. దళారీల ప్రమేయం లేకుండా రైతులకు, తాజా కూరగాయాలతో వినియోగదారులకు లాభం చేకూర్చేందుకు వీటిని ఏర్పాటుచేశారు. రైతుబజార్లు ప్రతీ మండల కేంద్రంలో ఏర్పాటుచేయాలని నిర్ణయించినా.. తరువాత వచ్చిన ప్రభుత్వాలు బుట్టదాఖలు చేస్తూ వచ్చాయి. అయితే ఇప్పటివరకూ రైతుబజార్లలో వ్యాపార కోణం చూడలేదు. కానీ తొలిసారిగా జగన్‌ సర్కారు వీటి ద్వారా ఆదాయం సమకూర్చుకోవాలని భావించింది. గతంలో నామమాత్రంగా షాపులకు అద్దెలు వసూలు చేసినా.. జనవరి నుంచి అమాంతం పెంచేశారు. ఈ ఏడాది జనవరి నుంచి వసూలు చేస్తున్నారు. షాపుల విస్తీర్ణం బట్టి రూ.1,000 నుంచి రూ.3 వేల వరకూ అద్దెగా నిర్ణయించారు. ఇదేమని ప్రశ్నిస్తుంటే రైతుబజార్ల నిర్వహణకంటూ అధికారులు సమాధానం చెబుతున్నారు. రైతుబజార్లలో రైతులు లేకుండా చేయడమే ప్రభుత్వ ఉద్దేశంగా తెలుస్తోంది. దీనిపై అధికారులు పెదవివిరుస్తున్నారు.

ఈక్రాప్‌ ధ్రువీకరణ తప్పనిసరి

వాస్తవానికి రైతుబజార్లలో ఉండే వారు చిన్నసన్నకారు రైతులే. వీరికి సవాలక్ష కొర్రీలు పెడుతున్నారు. పొమ్మన లేక రైతుబజార్ల నుంచి పొగ పెడుతున్నారు. ఇది వరకు రైతులు నేరుగా రైతుబజార్లులలో తన పండించిన ఒకటి లేదా రెండురకాల కూరగాయలు, ఆకుకూరలు నేరుగా అమ్ముకునే సౌలభ్యం ఉండేది కానీ ఇప్పుడు మాత్రం కూరగాయలు విక్రయించేవారు రైతులా? కాదా? అని నిర్ధారించేందుకు ఈక్రాప్‌ ధ్రువీకరణ పత్రం తప్పనిసరి చేశారు. దీంతో చిన్నసన్నకారు రైతులు అవస్థలు పడుతున్నారు. ధ్రువీకరణపత్రం కోసం వారికి పడిగాపులు తప్పడం లేదు. దీని కోసం మార్కెటింగ్‌ శాఖ ఏడీ శ్యామ్‌కుమార్‌ వద్ద ప్రస్తావించగా అద్దె పెంపు వాస్తవమేనని చెప్పారు. కేవలం రైతుబజార్ల నిర్వహణ కోసమే అద్దెలు

Updated Date - 2023-02-15T00:21:33+05:30 IST