మృతదేహం లభ్యం
ABN , First Publish Date - 2023-09-26T00:13:27+05:30 IST
తోటపల్లి ప్రాజెక్టులో సోమవారం ఒక వ్యక్తి మృతదేహం లభ్యమైంది. దీనికి సంబంధిం చి సబ్‌ఇన్‌స్పెక్టర్ ఎం.రాజేష్ అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 20న రాయగడకు చెందిన శ్రీనివాస్ అశోక్‌కుమార్(30) వినాయకుని నిమజ్జనానికై రాయగడ సమీపంలోని నాగావళి నదికి వెళ్లాడు.

గరుగుబిల్లి, సెప్టెంబరు 25: తోటపల్లి ప్రాజెక్టులో సోమవారం ఒక వ్యక్తి మృతదేహం లభ్యమైంది. దీనికి సంబంధిం చి సబ్‌ఇన్‌స్పెక్టర్ ఎం.రాజేష్ అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 20న రాయగడకు చెందిన శ్రీనివాస్ అశోక్‌కుమార్(30) వినాయకుని నిమజ్జనానికై రాయగడ సమీపంలోని నాగావళి నదికి వెళ్లాడు. నిమజ్జనం చేస్తున్న సమయంలో కాలు జారి నదిలో పడ టంతో గల్లంతయ్యాడు. నదిలో ఈత రాకపోవడంతో అశోక్‌కుమార్ మృతదేహం ఈ ప్రాంతానికి కొట్టుకువచ్చిందని, సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతి చెందిన అశోక్‌కుమార్ జేకే పరిశ్రమలో విధులు నిర్వహిస్తున్నాడని, ఈయనకు వివా హం జరిగి రెండేళ్లు కావస్తుందని కుటుంబ సభ్యులు తెలిపారు. శవ పంచనామ ని మిత్తం మృతదేహాన్ని పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు.