ప్రభుత్వ స్థలాల్లో వైసీపీ జెండా దిమ్మెలు
ABN , Publish Date - Dec 22 , 2023 | 12:14 AM
జగనే ఎందుకు కావాలంటే కార్యక్ర మంలో భాగంగా అధికార పార్టీ నాయకులు జయతి, మెంటాడ గ్రామాల్లో ప్రభుత్వ స్థలాల్లో వైసీపీ జెండా దిమ్మెలను ఏర్పాటు చేశారు.
మెంటాడ: జగనే ఎందుకు కావాలంటే కార్యక్ర మంలో భాగంగా అధికార పార్టీ నాయకులు జయతి, మెంటాడ గ్రామాల్లో ప్రభుత్వ స్థలాల్లో వైసీపీ జెండా దిమ్మెలను ఏర్పాటు చేశారు. వీటిపై ఫిర్యాదులు అం దడంతో స్థానిక అధికారులు వాటిని తొలగించారు. అయితే ఇప్పలవలస, కైలాం, పిట్టాడలో మాత్రం తొల గించలేదు. దీనిపై ఇప్పలవలస సర్పంచ్ గెద్ద పైడిరాజు కలెక్టరేట్ స్పందనలో ఫిర్యాదు చేశారు. దీంతో బొబ్బిలి ఆర్డీవో ఆదేశాల మేరకు ఇప్పల వలసలో వైసీపీ జెండా దిమ్మెను తొలగించేందుకు వస్తానని స్థానిక తహసీ ల్దార్ సమాచారం ఇవ్వగా, ‘మా పార్టీ.. మా జెండా.. మా ఇష్టం’ అని తహసీ ల్దార్‌పై బెదిరింపులకు దిగినట్లు సమాచారం. దీంతో ఏంచేయాలో తెలియక తహసీల్దార్ సతమతమవుతున్నారు. కాగా, అధికారుల ఉదాసీనతపై టీడీపీ, జనసేన నాయ కులు మండిపడుతున్నారు. ఈ విషయమై తహసీల్దార్ రామకృష్ణ వివరణ కోరగా.. ‘ప్రభుత్వ స్థలాల్లో రాజకీ య పార్టీల జెండాలను ఆవిష్కరించరాదు. మెంటాడ, జయతిలో వైసీపీ జెండాలు తొలగించాం. ఇప్పలవలసలో తొలగించాలని సర్పంచ్ ఫిర్యాదు చేశారు. జెండా తొలగించాలని సిబ్బందిని అదేశించా’.అని చెప్పారు.