హౌసింగ్‌ లబ్ధిదారుల బిల్లులు చెల్లించాలి

ABN , First Publish Date - 2023-02-06T23:38:44+05:30 IST

తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో నిర్మించిన ఎన్టీఆర్‌ హౌసింగ్‌ పథకంలో లబ్ధిదారులకు బిల్లులు చెల్లిండాలని ఆ పార్టీ గరుగుబిల్లి మండల నాయకులు కోరారు.

హౌసింగ్‌ లబ్ధిదారుల బిల్లులు చెల్లించాలి

పార్వతీపురం, ఆంధ్రజ్యోతి : తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో నిర్మించిన ఎన్టీఆర్‌ హౌసింగ్‌ పథకంలో లబ్ధిదారులకు బిల్లులు చెల్లిండాలని ఆ పార్టీ గరుగుబిల్లి మండల నాయకులు కోరారు. ఈ మేరకు పార్టీ మండల కన్వీనర్‌ అక్కేన మధు ఆధ్వర్యంలో కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌కు వినతి పత్రం అందించారు. ఎన్టీఆర్‌ గృహ నిర్మాణ లబ్ధిదారులకు బిల్లులు చెల్లించకపో వడంతో ఆర్థిక ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎం.పురుషోత్తమ నాయుడు పెద్దింటి పూర్ణచంద్రరావు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-06T23:38:44+05:30 IST