బుజ్జిని పరామర్శించిన భువనేశ్వరి
ABN , First Publish Date - 2023-11-01T00:23:17+05:30 IST
మండలంలోని కడగండిపంచాయతీ పెద్దవంగర గ్రామానికి చెందిన సవర బుజ్జి విజయనగరం కంటకాపల్లి వద్ద జరిగిన రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి విజయనగరం ఆసుప త్రిలో చికిత్స పొందుతోంది.
సీతంపేట, అక్టోబరు 31: మండలంలోని కడగండిపంచాయతీ పెద్దవంగర గ్రామానికి చెందిన సవర బుజ్జి విజయనగరం కంటకాపల్లి వద్ద జరిగిన రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి విజయనగరం ఆసుప త్రిలో చికిత్స పొందుతోంది. ఈ బాలికను మంగళవారం నారా భువనేశ్వరి పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆమె వెంట టీడీపీ పాలకొండ నియోజకవర్గ ఇన్‌చార్జి నిమ్మక జయకృష్ణ ఉన్నారు.