Share News

విధి నిర్వహణలో బాధ్యతగా వ్యవహరించాలి

ABN , First Publish Date - 2023-10-30T01:13:03+05:30 IST

విజయనగరం ఉత్సవాలు.. పైడితల్లి అమ్మవారు పండగ సందర్భంగా విధులు నిర్వహించే పోలీసు అధికారులు, సిబ్బంది బాధ్యతగా వ్యవహరించాలని ఎస్పీ దీపిక పాటిల్‌ అన్నారు.

విధి నిర్వహణలో బాధ్యతగా వ్యవహరించాలి

విజయనగరం క్రైం: విజయనగరం ఉత్సవాలు.. పైడితల్లి అమ్మవారు పండగ సందర్భంగా విధులు నిర్వహించే పోలీసు అధికారులు, సిబ్బంది బాధ్యతగా వ్యవహరించాలని ఎస్పీ దీపిక పాటిల్‌ అన్నారు. ఆదివారం జిల్లా పోలీసు కార్యాలయ పెరేడ్‌ గ్రౌండ్‌లో బందోబస్తు నిమిత్తం వివిధ జిల్లాల నుంచి వచ్చిన సిబ్బందిని ఉద్దేశించి భద్రతా చర్యలపై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పండగను తిలకించేందుకు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు, ప్రజలు జిల్లాకు వచ్చే అవకాశం ఉన్నందున గొడవలు రాకుండా విధులు నిర్వర్తించాల న్నారు. సంయమనం పాటించాలన్నారు.

Updated Date - 2023-10-30T01:13:03+05:30 IST