Share News

తప్పులు దొర్లితే బాధ్యత వహించాలి

ABN , Publish Date - Dec 22 , 2023 | 12:11 AM

కచ్చితమైన నివేది కులు రూపొందించాలని, ఏమైనా తప్పులు దొర్లితే ఆయా నియోజకవ ర్గాల ఈఆర్వోలు, ఏఈఆర్వోలు బాధ్యత వహించాల్సి ఉంటుందని రాష్ట్ర ఓటర్ల జాబితా పరిశీలకులు ,ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జె.శ్యామ లరావు తెలిపారు. ఓటర్ల జాబితా ప్రక్రియలో భాగంగా ఓటు నమోదు, తొలగింపులు, సవరణలకు వచ్చిన దరఖాస్తులు అసంపూర్తిగా ఉన్న వాటికి సంబందించి ఆయా బీఎల్వోలపై ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం కలెక్టరేట్‌లో ఓటర్ల జాబితా సవర ణ ప్రక్రియపై సమీక్షించారు. జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లో చేపట్టిన సవరణ ప్రక్రియపై కలెక్టర్‌ నాగలక్ష్మి వివరించారు. ఈ విషయంపైౖ రూపొందించిన పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ను శ్యామలరావు తిలకించారు. వివిధ ఆంశాలపై ఈఆర్వోలను ప్రశ్నించారు.రాజకీయపార్టీలు ఇచ్చిన ఫిర్యాదులపై సమీక్షించారు.ఫారం 6,7,8 తదితర దరఖాస్తులను, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి హాజరైన బీఎల్వోలు, ఆయా నియోజకవర్గాల ఎన్నికల అధికారులు సమక్షంలో దరఖాస్తులను పరిశీలించారు. అసంపూర్తిగా ఉన్న దరఖాస్తులను పరిశీలించి, సంబందించి బీఎల్వోలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.నిర్ణీత గడువులోగా దరఖాస్తులను పరిశీలన పూర్తిచేయాలని చెప్పారు. సమావేశంలోని జేసీ మయూర్‌ అశోక్‌, డీఆర్వో అనిత, ఈఆర్వోలు వెంకటేశ్వరరావు, సుదర్శనదొర, నూకరాజు, సుధారాణి, సూర్యకళ, శాంతికుమారి, సాయిశ్రీ పాల్గొన్నారు.

తప్పులు దొర్లితే బాధ్యత వహించాలి
దరఖాస్తులును పరిశీలిస్తున్న ఓటర్ల జాబితా పరిశీలకుడు శ్యామలరావు

కలెక్టరేట్‌: కచ్చితమైన నివేది కులు రూపొందించాలని, ఏమైనా తప్పులు దొర్లితే ఆయా నియోజకవ ర్గాల ఈఆర్వోలు, ఏఈఆర్వోలు బాధ్యత వహించాల్సి ఉంటుందని రాష్ట్ర ఓటర్ల జాబితా పరిశీలకులు ,ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జె.శ్యామ లరావు తెలిపారు. ఓటర్ల జాబితా ప్రక్రియలో భాగంగా ఓటు నమోదు, తొలగింపులు, సవరణలకు వచ్చిన దరఖాస్తులు అసంపూర్తిగా ఉన్న వాటికి సంబందించి ఆయా బీఎల్వోలపై ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం కలెక్టరేట్‌లో ఓటర్ల జాబితా సవర ణ ప్రక్రియపై సమీక్షించారు. జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లో చేపట్టిన సవరణ ప్రక్రియపై కలెక్టర్‌ నాగలక్ష్మి వివరించారు. ఈ విషయంపైౖ రూపొందించిన పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ను శ్యామలరావు తిలకించారు. వివిధ ఆంశాలపై ఈఆర్వోలను ప్రశ్నించారు.రాజకీయపార్టీలు ఇచ్చిన ఫిర్యాదులపై సమీక్షించారు.ఫారం 6,7,8 తదితర దరఖాస్తులను, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి హాజరైన బీఎల్వోలు, ఆయా నియోజకవర్గాల ఎన్నికల అధికారులు సమక్షంలో దరఖాస్తులను పరిశీలించారు. అసంపూర్తిగా ఉన్న దరఖాస్తులను పరిశీలించి, సంబందించి బీఎల్వోలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.నిర్ణీత గడువులోగా దరఖాస్తులను పరిశీలన పూర్తిచేయాలని చెప్పారు. సమావేశంలోని జేసీ మయూర్‌ అశోక్‌, డీఆర్వో అనిత, ఈఆర్వోలు వెంకటేశ్వరరావు, సుదర్శనదొర, నూకరాజు, సుధారాణి, సూర్యకళ, శాంతికుమారి, సాయిశ్రీ పాల్గొన్నారు.

Updated Date - Dec 22 , 2023 | 12:11 AM