అక్రమ అరెస్టులతో బాబును కట్టడి చేయలేరు

ABN , First Publish Date - 2023-09-26T00:04:00+05:30 IST

ప్రజాదరణ ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును అక్రమ అరెస్టులతో కట్టడి చేయలేరని పార్టీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున అన్నారు.

అక్రమ అరెస్టులతో బాబును కట్టడి చేయలేరు

చీపురుపల్లి: ప్రజాదరణ ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును అక్రమ అరెస్టులతో కట్టడి చేయలేరని పార్టీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున అన్నారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ గత రెండు వారాలుగా చీపురుప ల్లిలో నిర్వహిస్తున్న రిలే దీక్ష శిబిరంలో ఆయన సోమవారం పాల్గొని, మాట్లాడారు. స్కిల్‌ కార్పొరేషన్‌లో అవినీతి జరిగిందన్న సాకుతో చంద్రబా బును అరెస్టు చేయడాన్ని రాష్ట్రంలోని అన్ని వర్గాలు ముక్తకంఠంతో ఖండించా యన్నారు. అయినా వైసీపీ నాయకులకు కనువిప్పు కలగడంపోవడం శోచనీయమన్నారు. ఈ రిలే దీక్షలో నాలుగు మండలాల పార్టీ నాయకులు రౌతు కామునాయుడు, సారేపాక సురేష్‌, బలగం వెంకటరావు, మండల అప్పలనాయుడు, పిన్నింటి సన్యాసినాయుడు, జి.సత్తిరాజు, మహంతి రమణమూర్తి, పైల బలరాం, రెడ్డి గోవిందరావు, ఆరతి సాహు, వైగాల సత్యం, ఈ.రామరత్నం, రెడ్డి విజయలక్ష్మి, కోటిపల్లి పద్మ, ముదునూరి రమాదేవి, వెంకటపతిరాజు, కలిశెట్టి సూరప్పడు, దుక్క రామకృష్ణ, తూట సూరిబాబు, శ్రీనివాసరావు, పెంటయ్య దొర, గుసిడి రమణ, శ్రీనివాసరావు, గురువులు, అప్పన్న తదితరులు పాల్గొన్నారు.

తార స్థాయికి వైసీపీ రాజకీయ కక్షలు

టీడీపీ గజపతినగరం నియోజకవర్గం ఇన్‌చార్జి కేఏ నాయుడు

గజపతినగరం: వైసీపీ అధికారం చేపట్టిన నాటి నుంచి నేటివరకు రాష్ట్రంలో రాజకీయకక్షలు తార స్థాయికి చేరుకున్నాయని, అందుకు నిదర్శనం చంద్రబాబు అక్రమ అరస్టే అని మాజీ ఎమ్మెల్యే కేఏ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం స్థానిక ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా చేపట్టిన రిలే దీక్షలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎటువంటి ఆధారాలు చూపకుండా చంద్రబాబును అరెస్టు చేయడం దుర్మార్గపు చర్య అన్నారు. కార్యక్రమంలో గజపతినగరం, దత్తిరాజేరు, గంట్యాడ మండల పార్టీ అధ్యక్షులు లక్ష్మునాయుడు, పెద్దింటి మోహన్‌, కొండపల్లి భాస్కరనాయుడు, లెంక బంగారునాయుడు, ప్రదీప్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-26T00:04:00+05:30 IST