ఆర్టీసీలో యూటీఎస్ సేవలపై అవగాహన
ABN , First Publish Date - 2023-08-02T00:00:33+05:30 IST
ఆర్టీసీలో యూటీఎస్ (యూనిఫైడ్ టికెటింగ్ సొల్యూషన్) సేవలపై విజయనగరం డిపో పరిధిలోని డ్రైవర్లు, కండక్టర్లకు మంగళవారం అధికారులు అవగాహన కల్పిం చారు. గతనెల 31న ‘ఆంధ్రజ్యోతి’లో పాత పద్ధతిలోనే శీర్షికతో కథనం ప్రచురితంకావడంతో ఉన్నతా ధికారులు స్పందించారు. ఆఘమేఘాల మీద క్షేత్రస్థాయి అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేశా రు. మరోరెండు రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని డిపో మేనేజరు శ్రీనివాస రావు, అసిస్టెంట్ మేనేజరు ఆదినారాయణ తెలిపారు. కండక్టర్ల వద్ద ఉన్న టిమ్ మిషన్ ద్వారా ప్రయా ణికులు ఫోన్‌పే, గూగూల్ పే, క్యూఆర్ కోడ్ లేదా ఇతర యూపీఐ ద్వారా నగదు చెల్లింపులు చేయ వచ్చునని చెప్పారు.
విజయనగరం రింగురోడ్డు: ఆర్టీసీలో యూటీఎస్ (యూనిఫైడ్ టికెటింగ్ సొల్యూషన్) సేవలపై విజయనగరం డిపో పరిధిలోని డ్రైవర్లు, కండక్టర్లకు మంగళవారం అధికారులు అవగాహన కల్పిం చారు. గతనెల 31న ‘ఆంధ్రజ్యోతి’లో పాత పద్ధతిలోనే శీర్షికతో కథనం ప్రచురితంకావడంతో ఉన్నతా ధికారులు స్పందించారు. ఆఘమేఘాల మీద క్షేత్రస్థాయి అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేశా రు. మరోరెండు రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని డిపో మేనేజరు శ్రీనివాస రావు, అసిస్టెంట్ మేనేజరు ఆదినారాయణ తెలిపారు. కండక్టర్ల వద్ద ఉన్న టిమ్ మిషన్ ద్వారా ప్రయా ణికులు ఫోన్‌పే, గూగూల్ పే, క్యూఆర్ కోడ్ లేదా ఇతర యూపీఐ ద్వారా నగదు చెల్లింపులు చేయ వచ్చునని చెప్పారు.