కక్షపూరిత రాజకీయాలు మానుకోవాలి
ABN , First Publish Date - 2023-03-02T00:13:15+05:30 IST
కక్షపూరిత రాజకీయాలు మానుకోవాలని, వైసీపీని ప్రజలు తరిమికొట్టే సమయం దగ్గర పడిందని నెల్లిమర్ల నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌చార్జి లోకం నాగమాధవి, మిరాకిల్ సాఫ్ట్‌వేర్ సంస్థ అధినేత ప్రసాదులోకం అన్నారు.
భోగాపురం: కక్షపూరిత రాజకీయాలు మానుకోవాలని, వైసీపీని ప్రజలు తరిమికొట్టే సమయం దగ్గర పడిందని నెల్లిమర్ల నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌చార్జి లోకం నాగమాధవి, మిరాకిల్ సాఫ్ట్‌వేర్ సంస్థ అధినేత ప్రసాదులోకం అన్నారు. ముంజేరు సమీప మిరాకిల్ కళాశాలలో బుధవారం వారు విలేకర్ల సమావేశం నిర్వహించి, మాట్లాడారు. ఎయిర్‌పోర్టుకు సంబంధించి నిర్వాసితుల తరపున పోరాడుతున్న తమపై వైసీపీ నాయకులు, అధికారులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. కొన్నేళ్ల కిందట ఈ ప్రాంతంలో 800 ఎకరాల భూమి కొన్నామని, రాష్ట్రంలో ఎకైక సాఫ్ట్‌వేర్ కంపెనీ ఇక్కడే ఉందని, ఇందులో ఎంతో మంది జీవనోపాధి పొందుతున్నారని వివరించారు. అలాంటి దానిలో వాగులు, కాలువలు ఉన్నాయంటూ క్రీడా స్థలాన్ని, రహదారిని సిమెంటు స్తంభాలతో కంచె ఏర్పాటు చేయడానికి పూనుకోవడం దారుణంగా ఉందన్నారు. దీనిపై కలెక్టర్, ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినా ఎటువం టి స్పందన లేదన్నారు. ఈ సమస్యల పై అంతర్జాతీయ స్థాయిలో ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఈ ప్రాంతంలో ఇప్పటివరకు ఎన్ని వెంచర్లు వేశారు.. తదితర పూర్తి చిట్టా తీస్తామని స్పష్టం చేశారు. పవన్‌కల్యాణ్ ఆదేశాలకు అనుగుణంగానే ప్రజల కోసం పోరాటం చేస్తామన్నారు. ఇప్పటికైనా కక్షపూరితమైన రాజకీయాలకు స్వస్తి పలకాలని వారు హితవుపలికారు.