మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి: ఎస్పీ

ABN , First Publish Date - 2023-06-26T23:48:28+05:30 IST

యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఎస్పీ దీపిక పిలుపునిచ్చారు.

మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి: ఎస్పీ
విజయనగరంలో ర్యాలీలో పాల్గొన్న ఎస్పీ దీపికా పాటిల్‌

యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఎస్పీ దీపిక పిలుపునిచ్చారు. సోమవారం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినం సందర్భంగా ఆర్టీసీ కాంప్లెక్స్‌ నుంచి ఎత్తు బ్రిడ్జి వరకు ర్యాలీ నిర్వహించారు. మత్తు పదార్ధాల విక్రయం, రవాణా, వినియోగం చేసే వారి సమాచారాన్ని స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన 14500 నెంబర్‌కు ఫోన్‌ చేసి తెలియజేయాలన్నారు. అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞలు చేయించారు. డీఎస్పీ గోవిందరావు, సీఐలు వెంకట్రావు, లక్ష్మణరావు, రాంబాబు, ఎస్‌ఐలు పాల్గొన్నారు. అలాగే జిల్లా వ్యాప్తంగా పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. (ఆంధ్రజ్యోతి బృందం)

Updated Date - 2023-06-26T23:48:28+05:30 IST