మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి
ABN , First Publish Date - 2023-02-06T23:45:26+05:30 IST
విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఎస్‌ఈబీ ఏఎస్పీ ఆస్మా ఫర్హీన్ అన్నారు. స్థానిక బీఆర్ అంబేడ్కర్ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలల్లో సోమవారం నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో జరిగిన అవగాహన కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

నెల్లిమర్ల: విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఎస్‌ఈబీ ఏఎస్పీ ఆస్మా ఫర్హీన్ అన్నారు. స్థానిక బీఆర్ అంబేడ్కర్ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలల్లో సోమవారం నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో జరిగిన అవగాహన కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ మాదక ద్రవ్యాలకు అలవాటైతే జీవితం చిత్తవుతుందన్నారు. విద్యార్థులు మంచి భవిష్యత్తును లక్ష్యంగా చేసుకుని పట్టుదలతో చదవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా యువజన శాఖ అధికారి విక్రమాదిత్య, ఎస్‌ఈబీ సీఐ జీఎస్ రాజశేఖర్‌నాయుడు, ఎస్‌ఐ నాగలక్ష్మి, సిబ్బంది, ప్రిన్సిపాల్ ఉషారాణి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.