పేకాట శిబిరాలపై దాడి

ABN , First Publish Date - 2023-01-15T00:10:20+05:30 IST

గూడెపువలస సమీపంలో పేకాట శిబిరంపై దాడి చేసి రూ.2లక్షల 90వేల 110 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ ఎస్‌.కృష్ణమూర్తి శనివారం తెలిపా రు.

పేకాట శిబిరాలపై దాడి

భోగాపురం: గూడెపువలస సమీపంలో పేకాట శిబిరంపై దాడి చేసి రూ.2లక్షల 90వేల 110 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ ఎస్‌.కృష్ణమూర్తి శనివారం తెలిపా రు. ముందస్తు సమాచారంతో దాడి చేసి, 14 మందిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. వారి వద్ద నుంచి రూ.2లక్షల 90వేల 110 స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశామని ఎస్‌ఐ తెలిపారు. ఫ రేగిడి: సంకిలిలో శుక్రవారం రాత్రి నిర్వహి స్తున్న పేకాట శిబిరంపై మఫ్టీలో ఉన్న ఎస్‌ఐ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో దాడులు నిర్వ హించారు. ఈసందర్భంగా పేకాట ఆడుతున్న 12 మందిని అరెస్టుచేసి, వారి వద్ద నుంచి రూ.13,600 సీజ్‌ చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

కోడి పందాలపై..

జామి: యాతపాలెం సమీపంలో నిర్వహిస్తున్న కోడి పందాలపై జామి ఎస్‌ఐ వీర బాబు ఆధ్వర్యంలో పోలీసులు శనివారం దాడి చేశారు. నలుగురిని అదుపులోకి తీసు కుని, నాలుగు కోడిపుంజులు, రూ.1,100 స్వాధీనం చేసుకున్నారు. ఫ భోగాపురం: ముడసర్లపేట సమీపంలో శనివారం నిర్వహిస్తున్న కోడిపందాలపై పోలీసులు దాడి చేసి, ఐదుగురిని అరెస్టు చేశారు. ముందుగా సమాచారం రావడంతో భోగాపురం సీఐ కేకేవీ విజయానంద్‌ ఆధ్వర్యంలో సర్కిల్‌ పోలీసులు కోడి పందాల శిబిరంపై దాడి చేశారు. ఈ దాడిలో ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని 4 కోడిపుంజులు, రూ.6,270 స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - 2023-01-15T00:10:22+05:30 IST